Holidays: మూడు రోజులు స్కూల్స్, కాలేజీలు బంద్..!
మేడారం జాతర సందర్భంగా నేడు, రేవు పాఠశాలలు మూతపడనున్నాయి. ఫిబ్రవరి 21, 22, 23,24 తేదీల్లో సెలవులు ప్రకటించారు. అయితే ఈ సెలవులు కేవలం ములుగు జిల్లాకు మాత్రమే ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. ఇందుకు సంబంధించి ములుగు జిల్లా జిల్లా కలెక్టర్ త్రిపాఠి ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేశారు. ఈ తేదీల్లో ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేట్ పాఠశాలలు రెండూ మూసివేస్తున్నట్లు ప్రకటించారు.
మేడారం జాతర ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా ప్రసిద్ధి చెందింది. మేడారం సమ్మక్క సారలమ్మ జాతరను తరచుగా తెలంగాణ కుంభమేళాగా అభివర్ణిస్తారు. భారీగా భక్తులు వస్తున్న నేపథ్యంలో విద్యార్థులు ఇబ్బంది పడకూడాడని ఈ నిర్ణయం తీసుకున్నారు. ములుగుతో పాటు మహబూబాబాద్, భూపాలపల్లి జిల్లాలకు కూడా సెలవులు ప్రకటించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. మేడారం వెళ్లే రూట్ లో స్కూల్ బస్సులు వెళ్లడం ప్రమాదకంగా ఉంటుందని చెబుతున్నారు.

మేడారం జాతర ఘనంగా కొనసాగుతోంది. బుధవారం రాత్రి సారలమ్మ గద్దెపైకి చేరుకున్నారు. గురువారం రాత్రి సమ్మక్కను గద్దె పైకి తీసుకురానున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన పండుగలలో ఒకటైన మేడారం మహా జాతర ఉత్సవాలకు హాజరయ్యే యాత్రికుల కోసం పర్యాటక శాఖ హెలికాప్టర్ సేవలను ప్రవేశపెట్టింది. బెంగుళూరులో ఉన్న తుంబి ఏవియేషన్ హెలికాప్టర్ సర్వీస్‌ను నిర్వహిస్తోంది. గత వారం ఫిబ్రవరి 17న ఈ సేవలను ప్రారంభించారు.
మేడారం జాతరకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. మేడారానికి భక్తులు భారీగా వెళ్తున్నారు. హైదరాబాద్ టూ వరంగల్, కరీంనగర్ టూ వరంగల్, వరంగల్ టూ మేడారం రూట్లు బిజీగా మారాయి. చాలా చోట్ల ట్రాఫిక్ జామ్ అవుతోంది.












Click it and Unblock the Notifications