హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

colonel santosh babu: హకీంపేట విమానాశ్రయానికి పార్థీవదేహం, నివాళులు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: భారత్-చైనా సరిహద్దు ఘర్షణలో వీర మరణం పొందిన కల్నల్ సంతోష్ బాబు పార్థీవదేహం హకీంపేట విమానాశ్రయానికి చేరుకుంది. ప్రత్యేక సైనిక విమానం ద్వారా సంతోష్ బాబు పార్థీవ దేహాన్ని హకీంపేటకు తీసుకొచ్చారు.

విమానాశ్రయంలోనే సంతోష్ బాబు భౌతిక కాయానికి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, మంత్రులు కేటీఆర్, మల్లారెడ్డి తోపాటు పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. అనంతరం సంతోష్ బాబు పార్థీవ దేహానికి ఆర్మీ అధికారులు
సైనిక లాంఛనాలతో వందనం సమర్పించారు.

colonel santosh babu dead body reached to hakimpet airport.

గోల్కొండ వసతి గృహం నుంచి సంతోష్ బాబు కుటుంబసభ్యులు కూడా హకీంపేటకు చేరుకున్నారు. విమానాశ్రయం నుంచి ఓఆర్ఆర్ మీదుగా రోడ్డు మార్గంలో సంతోష్ పార్థీవ దేహాన్ని సూర్యాపేటకు తరలించనున్నారు. సంతోష్ భౌతికకాయానికి నివాళులర్పించేందుకు బారీ ఎత్తున ప్రజాప్రతినిధులు, ప్రజలు హకీంపేట విమానాశ్రయంకు చేరుకున్నారు. అయితే, అనుమతి ఉన్నవారిని మాత్రమే ఆర్మీ అధికారులు విమానాశ్రయంలోనికి అనుమతించారు.

సొంత గ్రామంలో అంత్యక్రియలకు ఏర్పాట్లు

సంతోష్ బాబు అంత్యక్రియలను గురువారం సూర్యాపేట పక్కనే ఉన్న కేసారం గ్రామంలో ఆయన వ్యవసాయ క్షేత్రంలో నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, ఎస్పీ భాస్కరన్, ఆర్మీ ఉన్నతాధికారులు పరిశీలించారు. ఆర్మీ, ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో సంతోష్ బాబు అంత్యక్రియలు జరుగుతాయని తెలిపారు.

కరోనా నిబంధనలకు అనుగుణంగా అంత్యక్రియలు నిర్వహిస్తామని కలెక్టర్ చెప్పారు. ఆర్మీ మేజర్లు, ఉన్నతాధికారులు ఈ అంత్యక్రియల్లో పాల్గొంటారని చెప్పారు. బుధవారం రాత్రి 8గంటల వరకు సంతోష్ బాబు పార్థీవ దేహం ఇక్కడికి చేరుకుంటుందని కలెక్టర్ తెలిపారు. సంతోష్ బాబును కడసారి చూసేందుకు వచ్చే ప్రజలు భౌతిక దూరం పాటించాలన్నారు జిల్లా ఎస్పీ. కరోనా నేపథ్యంలో ప్రజలు సంయమనం పాటించాలని సూచించారు.

English summary
colonel santosh babu dead body reached to hakimpet airport.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X