బిర్యానీతో పోటీ పడ్డ కండోమ్స్..హైదరాబాద్‌వాసులు ఆటగాళ్లే
2024వ సంవత్సరం ముగింపు దశకు చేరుకుంది. ఇంకా కొన్ని రోజుల్లో 2025 మొదలుకాబోతుంది. ఈ సమయంలో 2024లో చాలానే మార్పులు, చేర్పులు చోటు చేసుకున్నాయి. అనేక రకాల సంఘటనలు ఈ 2024లో చోటు చేసుకున్నాయి. పార్లమెంట్ ఎన్నికల నుంచి ఒలింపిక్స్ వరకు, ఐపీఎల్ నుంచి వరల్డ్ కప్ వరకు ఇలా అనేక రకాల సంఘటనలు ఈ 2024లో చోటు చేసుకున్నాయి. అలాగే ఈ సంవత్సరం యూత్ కూడా రెచ్చిపోయినట్టు లెక్కలు చెబుతున్నాయి.
ఆన్‌లైన్ ద్వారా కండోమ్స్ వాడకం ఎక్కువగా ఉన్నాయని ఆయా కంపెనీలు చెబుతున్నాయి. నేటి యువత ఆన్‌లైన్‌కు ఎక్కువగా అలవాటు పడిపోతున్నారనే చెప్పాలి. ఈ కామర్స్ అడుగుపెట్టిన తరువాత బయటకు వెళ్లి షాపింగ్ చేయడమే మానేశారు. వేసుకునే దస్తులు దగ్గర నుంచి తినే తిండి వరకూ అన్ని కూడా ఆన్‌లైన్‌లో దొరకుతున్నాయి. 10 రూపాయిల వస్తువు దగ్గర నుంచి లక్షల్లో విలువ చేసే వస్తువు వరకూ ప్రతిది కూడా ఆన్‌లైన్‌లో దొరుకుతుండటంతో అందరూ దీనిపై వైపే మొగ్గు చూపిస్తున్నారు.

మధ్యతరగతి గృహిణీలు సైతం ఆన్‌లైన్ షాపింగ్‌కు అలవాటు పడటం విశేషం. పైగా ఆర్డర్ చేసిన వస్తువు నచ్చకపోతే రిటర్న్ చేసే అవకాశం కూడా ఉండటంతో ఆన్‌లైన్ షాపింగ్‌కే ఎక్కువ మొగ్గు చూపిస్తున్నారు. తాజాగా ఈ కామర్స్ దిగ్గజ సంస్థ అయిన స్విగ్గీ తమ ఆన్‌లైన్ షాపింగ్ వివరాలను బయటపెట్టింది. స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ - 2024 పేరిట ఓ నివేదికను విడుదల చేసింది. ఈ నివేదికలో విస్తుపోయే విషయాలను వెల్లడించింది. తాజా డేటా ప్రకారం.. హైదరాబాద్ నగర వాసులు.. గడచిన సంవత్సరంలో 2 లక్షల కండోమ్ ప్యాకెట్లను ఆర్డర్ చేసుకున్నట్లు స్పష్టం చేసింది.
అత్యధికంగా కండోమ్స్ ఆర్డర్లు వచ్చినట్టు స్విగ్గీ సంస్థ తెలిపింది. కండోమ్స్ తరువాత ఉల్లిపాయి,అరటి పండు , చిప్స్ ఆర్డర్ చేసినట్టు స్విగ్గీ సంస్థ తమ నేవేదికలో పేర్కొంది. హైదరాబాద్ ప్రజలు ఏడాది కాలంలో ఏకంగా రూ. 31 కోట్లు కేవలం ఐస్ క్రీమ్ తినడానికి ఖర్చు చేయగా.. 15 కోట్లు.. మహిళలు బ్యూటీ ప్రొడక్ట్స్ కు ఖర్చు చేసినట్లు స్విగ్గీ తెలిపింది.












Click it and Unblock the Notifications