వరి దీక్ష ఓ హెచ్చరిక.!వచ్చే ఎన్నికల్లో ఎవరిని గెలిపించాలో రైతులకు తెలుసన్న పొన్నాల.!
హైదరాబాద్ : భారత దేశానికి వ్యవసాయానికి అభినాభావ సంబంధం ఉందని, దేశంలో అత్యధిక శాతం ప్రజలు వ్యవసాయం మీదే ఆధారపడి జీవనం వెళ్లదీస్తుంటారని మాజీ పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య స్పష్టం చేసారు. పార్లమెంటరీ వ్యవస్థలో చర్చలు, మేధావుల సలహాలు తీసుకోకుండా వ్యవసాయ చట్టాలకు చెందిన ఆర్డినెన్స్ తీసుకొచ్చారని కేంద్ర ప్రభుత్వంపైన పొన్నాల తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసారు.
ఈ మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పదమూడు నెలల పాటు రైతులు ఆందోళన చేశారని, వ్యవసాయ చట్టాలు వెనక్కి తీసుకోవాలని రాహుల్ గాంధీ ముందే డిమాండ్ చేశారని పొన్నాల లక్షయ్య గుర్తు చేసారు.పెట్టుబడి దారులకి కొమ్ముకాసే చట్టాలు అవని, చట్టాలు వెనక్కి తీసుకోవడం, రైతులు, కాంగ్రెస్ పార్టీ విజయమని ఉద్ఘాటించారు.బలిసిన దున్నపోతును, కొవ్వెక్కిన కోడె గిత్తను రైతే దారికి తెచ్చి, నాగలితో దున్నినట్టు, రైతులే మదమెక్కిన ముఖ్యమంత్రి, ప్రగల్భాలు పలికే ప్రధాన మంత్రులకు
బుద్ధి చెపుతారని పొన్నాల లక్ష్మయ్య తెలిపారు.

కాంగ్రెస్ హయాంలో ఈ స్థాయిలో ఆందోళనలు ఎప్పుడైనా జరిగాయా.?అని పొన్నాల లక్ష్మయ్య సూటిగా ప్రశ్నించారు. రైతే రాజు అనే నినాదంతో కాంగ్రెస్ అనేక కార్యక్రమాలు తీసుకొచ్చిందని, 2013 భూసేకరణ చట్టం తీసుకొస్తే, సవరణలు చేసి వెనక్కి తీసుకున్నారని మండిపడ్డారు. పార్లమెంట్ లో సవరణలు చేసి భూసేకరణ చట్టాన్ని ఆమోదించకుండా వెనక్కి తీసుకోవడం అత్యంత విచారకరమన్నారు పొన్నాల. విత్తన చట్టం కూడా పార్లమెంటులో సవరణలు చేసి వెనక్కి తీసుకున్నారని ఆగ్రహ వ్యక్తం చేసారు.

గోదాముల్లో నిల్వలు ఉంటే వ్యవసాయ శాఖ మంత్రి ఏం చేస్తున్నారో ప్రధాని మోదీ ఏరోజైనా సమీక్ష నిర్వహించారా అని నిలదీసారు. ఎగుమతులను పెంచాల్సిన బాద్యత కేంద్ర ప్రభుత్వానిది కాదా అని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ వరి దీక్ష ఒక హెచ్చరిక లాంటిదని, ప్రభుత్వ పతనానికి పునాది రైతుల ఆందోళన అని స్పష్టం చేసారు. రైతుల ఆనాటి విద్యుత్తు ఆందోళన ప్రభుత్వాన్నే కూల్చేసిన అంశాన్ని ఇటు తెలంగాణ ప్రభుత్వం, అటు కేంద్ర ప్రభుత్వం చర్చిపోరాదని పొన్నాల లక్ష్మయ్య హితవు పలికారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications