లోకేష్ తో కేటీఆర్ మంత్రాంగం- అనూహ్య ప్రతిపాదన..!?
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం. రాష్ట్రంలో పట్టు కోసం మూడు ప్రధాన పార్టీలు పోటీ పడు తున్నాయి. వరుసగా పథకాల అమలు ద్వారా స్థానిక సంస్థల వేళ ఏకపక్షంగా గెలుపే లక్ష్యంగా అధికార కాంగ్రెస్ అడుగులు వేస్తోంది. బీఆర్ఎస్ తమ బలం తగ్గించుకోలేదని నిరూపించుకునేలా వ్యూహలు సిద్దం చేస్తోంది. బీజేపీ కొత్త ప్రణాళికలతో సమాయత్తం అవుతోంది. ఇదే సమయంలో ఏపీ మంత్రి లోకేష్ తో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రహస్యంగా భేటీ అయ్యారనే ప్రచారం కీలక మలుపుగా మారింది. ఇంతకీ ఏం జరిగిందీ... రెండు పార్టీల అజెండా ఏంటి...
ప్రచారం వెనుక
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏపీ మంత్రి నారా లోకేష్ తో రహస్యంగా భేటీ అయ్యారని కాంగ్రెస్ నేత సామా రామ్మోహన్ రెడ్డి ఆరోపించారు. తాము ఏపీతో బనకచర్ల పైన పోరాటం చేస్తుంటే కేటీఆర్ ఎందుకు కలిసారో చెప్పాలని డిమాండ్ చేసారు. కేటీఆర్ తాను లోకేష్ తో కలిసిన విషయం పైన స్పందిస్తే.. తాను మిగిలిన విషయాలు వెల్లడించేందుకు సిద్దంగా ఉన్నానని చెప్పుకొచ్చారు. కాగా, సామా కామెంట్స్ పైన ఇప్పటి వరకు కేటీఆర్ క్యాంపు నుంచి స్పందన రాలేదు. కాగా.. త్వరలో జరిగే జూబ్లీహిల్స్ బై పోల్ ఇప్పుడు బీఆర్ఎస్ కు ప్రతిష్ఠాత్మకంగా మారుతోంది.

కేటీఆర్ ప్రతిపాదన
ఈ ఎన్నికలో టీడీపీ పోటీ చేస్తుందనే ప్రచారం వేళ.. తాజాగా లోకేష్ తో కేటీఆర్ భేటీ ప్రచారం మరింత ఉత్కంఠగా మారింది. బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే గోపీనాథ్ మరణంతో ఉప ఎన్నిక అని వార్యంగా మారింది. కంటోన్మెంట్ తరహాలోనే ఇక్కడా విజయం సాధించాలని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. సిట్టింగ్ సీటు దక్కించుకోవాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. బీజేపీ ఎన్డీఏలో భాగ స్వాములుగా ఉన్న టీడీపీ - జనసేన మద్దతుతో సత్తా చాటాలని ప్రయత్నాలు చేస్తోంది. ఇక, టీడీపీ ఇక్కడ ఉన్న సామాజిక సమీకరణాలు. .బలా బలాలతో తామే పోటీ చేయాలనే ఆలోచనతో ఉన్నట్లుగా ప్రచారం సాగుతోంది. కాగా, ఇప్పుడు కేటీఆర్ టీడీపీ నేత లోకేష్ తో కొత్త ప్రతిపాదన చేసినట్లు పార్టీ నేతల సమాచారం. గోపీనాధ్ తొలి సారిగా 2014 లో టీడీపీ నుంచే గెలుపొందారు.
టీడీపీ ఆలోచన
గోపీనాథ్ మరణం సమయంలోనూ లోకేష్ నివాళి అర్పించారు. గోపీనాధ్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. కాగా, ఇప్పుడు తాము గోపీనాథ్ కుటుంబ సభ్యులకే సీటు ఇస్తున్న వేళ టీడీపీ నుంచి పోటీ లేకుండా సహకారం కోరేందుకు కేటీఆర్ ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. అయితే, లోకేష్ నేరుగా కేటీఆర్ ను కలిసేందుకు సుముఖత వ్యక్తం చేయలేదని చెబుతున్నారు. టీడీపీ తోనూ గోపీనాథ్ కుటుంబ సభ్యులకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. దీంతో.. ఇప్పుడు ఈ సీటు ను గెలుచుకునే క్రమంలో కేటీఆర్ ఈ ఆలోచన చేసినట్లు చెబుతున్నారు. అయితే.. జూబ్లీహిల్స్ పోటీ విషయంలో టీడీపీ తుది నిర్ణయం ఏంటనేది స్పష్టత రావాల్సి ఉంది.












Click it and Unblock the Notifications