కాంగ్రెస్-సీపీఐ పొత్తు ఖరారు: ఆ స్థానం నుంచి సీపీఐ పోటీ, మరో 2 ఎమ్మెల్సీలు అప్పుడే
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్, సీపీఐ మధ్య పొత్తు కుదిరింది. సోమవారం సీపీఐ కార్యాలయానికి వెళ్లిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఏఐసీసీ పరిశీలకురాలు దీపాదాస్ మున్సీలకు సీపీఐ నేతలు నారాయణ, కూనంనేని సాంబశివరావు, చాడ వెంకటరెడ్డి, పల్లా వెంకటరెడ్డిలు స్వాగతం పలికారు. అనంతరం పొత్తు, ఇతర రాజకీయ అంశాలపై ఇరు పార్టీలకు చెందిన నేతలు చర్చించారు.
కొత్తగూడెం సీటుతోపాటు అధికారంలోకి వచ్చిన తర్వాత మరో రెండు ఎమ్మెల్సీలు ఇచ్చేట్లు ఇరు పార్టీలు అంగీకారానికి వచ్చాయి. రేవంత్ రెడ్డి, నారాయణ, కూనంనేని చర్చల సారాంశాన్ని మీడియాకు వెల్లడించారు. కొత్తగూడెం నుంచి సీపీఐ పోటీ చేయబోతోందని తెలిపారు. కొత్తగూడెంలో సీపీఐ విజయం కోసం కృషి చేస్తామన్నారు రేవంత్. ఎన్నికల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. సీపీఐకి 2 ఎమ్మెల్సీ స్థానాలు ఇస్తామని చెప్పారు.

తమకు రాజకీయంగా ఉండే ఒత్తిళ్లు గురించి సీపీఐ నాయకులకు వివరించినట్లు తెలిపారు. నెల రోజుల కిందట నిశ్చితార్థం అయిందని.. ఇవాళ పెళ్లి ముహూర్తం కుదిరిందని సీపీఐ నారాయణ తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. కేసీఆర్ చేతిలో నుంచి తెలంగాణను విముక్తి చేయడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన బాగుందన్నారు.
బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం మూడు పార్టీలు ఒక్కటేనని నారాయణ ఆరోపించారు. బండి సంజయ్‌కు బండి కట్టి ఇంటికి పంపారని విమర్శించారు. కేసీఆర్ పోకడకి వ్యతిరేకంగా పోరాడటంతోపాటు ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీతో పొత్తు తమకు అనివార్యమైనట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి సానుకూల పవనాలు వీస్తున్నాయన్నారు. కాంగ్రెస్ అనుకూల వాతావరణాన్ని చూసి ఇతర పార్టీలు కృత్రిమంగా నడుస్తున్నాయన్నారు.
ప్రశ్నించే గొంతుక అసెంబ్లీలో ఉండాలని.. కానీ, బీఆర్ఎస్ ఆ గొంతులను నొక్కేసిందని కూనంనేని విమర్శించారు. సీపీఎంతో కూడా ఏదోక విధంగా అవగాహన వస్తుందని తాము భావించామన్నారు. భవిష్యత్ లో కూడా ఈ స్నేహం ఇలానే కొనసాగాలని భావిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని కూనంనేని ధీమా వ్యక్తం చేశారు.
-
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..!












Click it and Unblock the Notifications