Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలకు కాంగ్రెస్ ఇంఛార్జీల నియామకం: రేవంత్ సహా వీరికే బాధ్యతలు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికలపై దృష్టి సారించింది. ఈ క్రమంలోనే తెలంగాణలోని మొత్తం 17 లోక్‌సభ నియోజకవర్గాలకు ఇంఛార్జీలను ఆ పార్టీ నియమించింది. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ గెలుపులో కీలక పాత్ర పోషించిన వారికి ఈ బాధ్యతలు అప్పించింది. ఇంఛార్జీలుగా నియమితులైన వారిలో ముఖ్యమంత్రిపాటు దాదాపు అందరూ మంత్రులే ఉండటం గమనార్హం,.

సీఎం, టీపీసీసీ చీఫ్ రేవంత్ - చేవెళ్ల, మహబూబ్‌నగర్
భట్టి విక్రమార్క - సికింద్రాబాద్, హైదరాబాద్
జూపల్లి కృష్ణారావు - నాగర్‌కర్నూల్
ఉత్తమ్ కుమార్ రెడ్డి - నల్గొండ
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి - భువనగిరి
కొండా సురేఖ - వరంగల్

congress appointed in-charge for 17 lok sabha seats in telangana

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి - మహబూబాబాద్, ఖమ్మం
సీతక్క - ఆదిలాబాద్
దుద్దిళ్ల శ్రీధర్ బాబు - పెద్దపల్లి
పొన్నం ప్రభాకర్ - కరీంనగర్
జీవన్ రెడ్డి - నిజామాబాద్
పీ సుదర్శన్ రెడ్డి - జహీరాబాద్
దామోదర రాజనర్సింహ - మెదక్
తుమ్మల నాగేశ్వర రావు -మల్కాజిగిరి

ఇది ఇలావుండగా, వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీని పోటీ చేయించాలని రాష్ట్ర పార్టీ తీర్మానం చేసింది. గాంధీభవన్‌లో సోమవారం కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం జరిగింది. 5 అంశాల ఎజెండాగా సాగిన పీఏసీ సమావేశంలో ఎన్నికల ఫలితాలు, 6 గ్యారంటీల అమలు, నామినేటెడ్ పోస్టులు, పార్లమెంట్ ఎన్నికల సన్నద్ధతపై చర్చించారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో సీట్లు తగ్గడంపైనా సమాలోచనలు చేసినట్లు సమాచారం.

ఈ సందర్భంగా వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఏఐసీసీ అగ్ర నేత సోనియా గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేయాలని పీఏసీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. దీంతో పాటు గ్రామ సభలు పెట్టి అర్హులైన వారికి రేషన్ కార్డులు ఇస్తామని, వంద రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని తీర్మానించింది. అధికారం ఇచ్చిన తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపింది. తెలంగాణ కాంగ్రెస్ గెలుపునకు కృషి చేసిన ఏఐసీసీ నేతలకు ధన్యవాదాలు తెలిపింది.

కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జీ మాణిక్ ​రావు ఠాక్రే అధ్యక్షతన కొనసాగిన ఈ సమావేశంలో పీసీసీ చీఫ్, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ ​కుమార్​ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన తొలి పీఏసీ సమావేశం కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+