జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్ధి ఫిక్స్ , అక్కడే కొత్త ట్విస్ట్..!!

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ బై పోల్ చుట్టూ రాజకీయం తిరుగుతోంది. ప్రధాన పార్టీలకు ఇక్కడ గెలుపు ప్రతిష్టాత్మకంగా మారుతోంది. అధికార కాంగ్రెస్ కంట్మోన్మెంట్ తరహాలో ఇక్కడా గెలుపు కోసం ప్రయత్నిస్తోంది. బీఆర్ఎస్ సిట్టింగ్ సీటు నిలబెట్టుకోవాలని వ్యూహాలను అమలు చేస్తోంది. బీజేపీ మిత్రపక్షాల సాయంతో సీటు పైన కన్నేసింది. కాగా, కాంగ్రెస్ అభ్యర్ది పైన దాదాపు నిర్ణయానికి వచ్చారు. మంత్రులకు సీఎం రేవంత్ ఉప ఎన్నిక బాధ్యత అప్పగించారు. కాగా, పార్టీలో ఈ ఎన్నిక వేళ ఊహించని ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి.

కీలక నిర్ణయాలు
జూబ్లీహిల్స్ సిట్టింగ్ ఎమ్మెల్యే గోపీనాథ్ మరణంతో ఉప ఎన్నిక జరగనుంది. ఏ క్షణంలో అయినా ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల అయ్యే అవకాశం ఉంది. బీఆర్ఎస్ ఇక్కడ నుంచి గోపీనాథ్ కుటుంబ సభ్యులకే ఇవ్వాలని నిర్ణయించింది. హైదరాబాద్ నగరంలో ఈ సీటులోనూ గెలిచి తమ పట్టు పెంచుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. అందులో భాగంగా ఈ బైపోల్ బాధ్యతలను మంత్రి వివేక్ కు సీఎం రేవంత్ అప్పగించారు. మరో ఇద్దరు మంత్రులు తుమ్మల, పొన్నం సైతం జూబ్లీ హిల్స్ బాధ్యతలను చూస్తున్నారు. తుమ్మలకు వెంగళరావు నగర్, సోమాజీ గూడ డివిజన్ల బాధ్యత అప్పగించారు. పొన్నంకు యూసఫ్ గూడ, ఎర్రగడ్డ డివిజన్ల బాధ్యతలను కేటాయించారు.

congress-appoints-key-leaders-for-jubilee-hills-poll-minister-vivek-as-election-in-charge

కీలక బాధ్యతలు
నియోజకవర్గ ఇంఛార్జ్ గా ఉన్న వివేక్ కు నామినేటెడ్ పదవుల్లో ఉన్న ఛైర్మన్ లను అప్పగించారు. వారిని పోలింగ్ బూత్ ల వారీగా ఎన్నికల బాధ్యతలను అప్పగిస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అభ్యర్దిగా గతంలో పోటీ చేసిన అజాహరుద్దీన్ ను తిరిగి బరిలోకి దింపాలని దాదాపు నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. తాజాగా మంత్రి పొన్నం స్థానికులకే సీటు కేటాయిస్తామని ప్రకటించారు. దీని పైన పార్టీ నేత ఫిరోజ్ ఖాన్ స్పందించారు. పొన్నం వ్యాఖ్యలు సరికాదన్నారు. ఈ ఎన్నిక కాంగ్రెస్ కు ప్రతిష్ఠాత్మకంగా పేర్కొన్నారు. స్థానికులకే ఇస్తామని చెప్పటం పైన అభ్యంతరం వ్యక్తం చేసారు. వయనాడ్ లో రాహుల్, ప్రియాంక స్థానికులా అని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ సీఎం ఉండే నియోజకవర్గమని గుర్తు చేసారు. ఈ ఉప ఎన్నిక కాంగ్రెస్ కు ప్రతిష్ఠాత్మకమని చెప్పుకొచ్చారు. దీంతో, సీటు కోసం కాంగ్రెస్ లో పోటీ పెరుగుతోంది.

ప్రతిష్ఠాత్మకం
తాజాగా ముగ్గురు మంత్రులు ఉప ఎన్నిక పైన చర్చించారు ఆశావాహులంతా కలిసి నియోజక వర్గంలో పర్యటిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటామని మంత్రి పొన్నం చెప్పారు. ఇక, జూబ్లీ ల్స్ ఉప ఎన్నిక కోసం బీఆర్ఎస్ కసరత్తు మొదలు పెట్టింది. తమ పార్టీ నుంచి రెండు సార్లు విజయం సాధించిన గోపీనాథ్ కుటుంబానికి సీటు ఇవ్వాలని భావిస్తోంది. నియోజకవర్గం లో పబ్లిక్ పల్స్ పైన ఒక ప్రధాన పార్టీ సర్వే చేయిస్తున్నట్లు సమాచారం. గోపీనాథ్ సతీమణి సునీతను బరి కి దింపాలనేది బీఆర్ఎస్ ఆలోచనగా ఉంది. కాగా, ఎంఐఎం సహకారం ఏ రూపంలో కాంగ్రెస్ కు అందినా... అధికార పార్టీకి సీటు దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తేల్చినట్లు తెలుస్తోంది. గెలుపు ప్రతిష్ఠాత్మకం ఇక్కడ గెలుపు సిట్టింగ్ సీటు కావటంతో బీఆర్ఎస్ ... అధికారంలో ఉండటం కాంగ్రెస్ కు ప్రతిష్ఠాత్మకంగా మారుతోంది. ఇదే సమయంలో బీజేపీ నుంచి ఒక పారిశ్రామిక వేత్త పేరు ప్రముఖంగా ఈ సీటు కోసం వినిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+