పీర్జాదిగూడ మేయర్, కార్పొరేటర్ల కిడ్నాప్‌ యత్నం: కాంగ్రెస్‌పై హరీశ్ రావు ఫైర్

హైదరాబాద్: పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్‌లో ఎలాగైనా అవిశ్వాస తీర్మానం నెగ్గాలని కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ నేతలపై దాడులకు పాల్పడుతున్నారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు మండిపడ్డారు. బీఆర్ఎస్ మేయర్ జక్కా వెంకట్ రెడ్డి, కార్పొరేటర్లను కిడ్నాప్ చేయడానికి కాంగ్రెస్ నాయకులు ప్రయత్నిస్తున్నారన్నారు.

కార్పొరేటర్లపై దాడిని ఖండిస్తూ ఎక్స్‌లో ట్వీట్ చేశారు హరీశ్ రావు. ఔటర్ రింగ్ రోడ్డుపై 20 కార్లతో మేయర్, కార్పొరేటర్లను వెంబడిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ధ్వజమెత్తారు. డీజీపీ, రాచకొండ కమిషనర్ వెంటనే పీర్జాదిగూడ మేయర్, కార్పొరేటర్లకు భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులపై దాడులకు పాల్పడటం గర్హనీయమని హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి దాడులకు పాల్పడితే ఊరుకోబోమని హెచ్చరించారు.

congress attempt to kidnap Peerzadiguda mayor corporators Harish Rao

మల్లారెడ్డి భూవివాదం: సర్వే చేసిన అధికారులు

హైదరాబాద్‌​లోని పేట్​ బషీర్​బాద్​ పీఎస్​ పరిధిలోని సుచిత్రలో సర్వే నంబరు 82కు సంబంధించిన రెండున్నర ఎకరాల భూమి మాదంటే మాదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ వర్గం వారు వాదిస్తున్నారు. తమ భూమిలో అక్రమంగా ఫెన్సింగ్​ వేశారంటూ మల్లారెడ్డి అనుచరులు కంచెను కూల్చడం ఘర్షణకు దారి తీసింది. ఇరువర్గాలు పరస్పరం ఫిర్యాదులతో ఉద్రిక్తతలకు కారణమైంది.

ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన అధికారులు సర్వే నంబరు 82 భూమిలో సర్వే చేపట్టారు. బందోబస్తు మధ్య యంత్రాంగం సరిహద్దులు గుర్తించే పనిలో పడ్డారు. సర్వే నంబరు 82లో ఉన్న భూమి మొత్తం తమదేనని మాజీ మంత్రి మల్లారెడ్డి చెబుతున్నారు. అందుకు సంబంధించిన ఆధారాలన్నీ తమ వద్ద ఉన్నాయని స్పష్టం చేశారు. ఈ భూమిని 15 ఏళ్లు క్రితం కొనుగోలు చేశామన్నారు. ఈ భూమికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు తమ వద్ద ఉన్నాయని అన్నారు.

అంతేగాక, ఎప్పటికప్పుడు పన్నులు కడుతున్నామని మల్లారెడ్డి చెప్పారు. కాంగ్రెస్​ పార్టీ మొదటి నుంచి తనపట్ల వివక్ష చూపుతుందని మండిపడ్డారు. ఎమ్మెల్యే అయిన తనకే భద్రత లేకపోతే సామాన్యులకు ఏం ఉంటుందని నిలదీశారు. తమది తప్పుంటే ఆ భూమిని వాళ్లనే తీసుకోమని మాజీ మంత్రి మల్లారెడ్డి సవాల్​ విసిరారు.

మరోవైపు, ప్రభుత్వ విప్​, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్​ మాట్లాడుతూ.. తనతో పాటు ఆరుగురు కలిసి సుధామ నుంచి 2015లో సదరు భూమి కొనుగోలు చేసినట్లు స్పష్టం చేశారు. మల్లారెడ్డి, రాజశేఖర్​ రెడ్డిని కలిసి భూ వివాదాన్ని సెటిల్​ చేయాలని అడగ్గా వారు కనీసం స్పందించలేదని చెప్పారు. కాంగ్రెస్​ పార్టీపై మాజీ మంత్రి తప్పుడు ప్రచారం చేస్తున్నారని లక్ష్మణ్​ మండిపడ్డారు. తన నిజాయతీని సీఎం వద్ద నిరూపించుకోవాలని ఆయన సవాల్​ విసిరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+