Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కాంగ్రెస్ అభ్యర్థి స్రవంతి గెలవకుండా మునుగోడులో రాజకీయ కుట్ర.!జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు.!

హైదరాబాద్ : టిఆర్ఎస్, బీజేపీ మునుగోడు ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతిని గెలవకుండా ఆ రెండు పార్టీల మధ్యే ప్రజల్లో చర్చ ఉండేలా మునుగోడు ప్రజానికాన్ని రెచ్చగొడుతున్నాయని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి స్రవంతి గెలవకుండా మునుగోడులో రాజకీయ కుట్ర జరుగుతుందన్నారు జగ్గారెడ్డి. రాష్ట్రంలో మునుగోడుతో పాటు నల్గొండ ప్రజలకు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన చరిత్ర కాంగ్రెస్ కు ఉందన్నారు. అదికూడా పాల్వాయి గోవర్ధన్ రెడ్డి నాయకత్వం లోనే జరిగిందని, టిఆర్ఎస్, బీజేపీ వ్యూహాత్మక రాజకీయ కలయికతో కాంగ్రెస్ మొదటి స్థానంలో గెలువద్దని, రెండో స్థానం కూడా రావొద్దని టిఆర్ఎస్, బీజేపీ ఒకరి పై ఒకరు లేనిపోని ఆరోపణలు చేసుకుంటుంన్నారన్నారు జగ్గారెడ్డి. ఇది మునుగోడు ఓటర్లు గమనించాలని, ఒక సమస్య పరిష్కారం విషయంలో కాంగ్రెస్ కు ఉన్న కమిట్మెంట్ టిఆర్ఎస్, బీజేపీ లకు ఉండదన్నారు. మునుగోడులో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే, రానున్న కాలంలో రాష్ట్ర ప్రజలకు మేలు చేసినవారవుతారని మునుగోడు ప్రజలకు జగ్గారెడ్డి విజ్ఞప్తి చేసారు.

 Congress candidate Sravanti didnt win, it was a political conspiracy.Jaggareddy sensational comments!

ఒక రైతుకు సంవంత్సరానికి ఒక ఎకరం పై ఇచ్చే 10 వేల రైతు బందుతో ఆ కుటుంబం బతికే పరిస్థితి ఉండదని, రైతు లకు గిట్టుబాటు ధర, పంట నష్ట పరిహారం, ఆర్థిక సహాకారం అందిస్తేనే రైతు కుటుంబం సంతోషంగా ఉంటుందన్నారు జగ్గారెడ్డి. ఇలాంటి పని కాంగ్రెస్ ప్రభుత్వం తోనే సాధ్యం అవుతుందన్నారు. సోనియా, రాహుల్ గాంధీ నాయకత్వంలో ఒక మాట ఇస్తే నిలబెట్టుకునే కుటుంబం కాంగ్రెస్ మాత్రమే నన్నారు జగ్గారెడ్డి. ఇది ప్రజలు గమనించాలని, బీజేపీ మతంతో రెచ్చగొడుతుందని, టిఆర్ఎస్ ఆశ పెట్టి గెలిచే ప్రయత్నం చేస్తుందన్నారు. మునుగోడు ప్రజలు ఈ అంవాలన్నిటిపైనా ఆలోచన చేయాలని, పది రోజుల సంతోషం తో సంతృప్తి పడతారో, భవిష్యత్ అభివృద్ధికి దోహద పడుతారో తేల్చుకోవాలన్నారు జగ్గన్న. కాంగ్రెస్ అభ్యర్థి గెలిస్తే నిరంతరం సంతోషం వచ్చే పరిస్థితులు వస్తాయని, డబ్బులు ఎవరు ఇచ్చినా..మీ డబ్బే కాబట్టి తీసుకోండి ,కాంగ్రెస్ అభ్యర్ధి ని గెలిపించాలని జగ్గారెడ్డి వినూత్న పిలుపునిచ్చారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+