కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి సర్వ నాశనం చేశాడు.. అధిష్టానం షాకింగ్ కామెంట్స్

తెలంగాణ కాంగ్రెస్ వర్గాల్లో కలకలం రేపే ఒక సంచలన విషయం బయటపడింది. ఆరు నెలల పాలన పూర్తయినా కాకముందే, సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంపై ఏకంగా జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల ద్వారా ఈ షాకింగ్ వివరాలను సీనియర్ జర్నలిస్ట్, 'సౌత్ ఫస్ట్' ఎడిటర్ వాసు వెల్లడించారు.

అసంతృప్త కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో జరిగిన భేటీలో మల్లికార్జున ఖర్గే తన ఆవేదనను పంచుకున్నారని సమాచారం. ఆ సందర్భంలో ఆయన చేసిన వ్యాఖ్యలు తెలంగాణ కాంగ్రెస్ భవిష్యత్తుపై అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.రేవంత్ రెడ్డి ప్రభుత్వం గ్యారెంటీల అమలులో ఘోరంగా విఫలమైంది. పరిపాలన గాడి తప్పిందని ప్రజలు బలంగా భావిస్తున్నారు.మంత్రుల మధ్య జరుగుతున్న కీచులాటలు, శాఖల వాటాల పంపకాలపై జరుగుతున్న అంతర్గత లొల్లి... కాంగ్రెస్ ప్రభుత్వ ప్రతిష్టను తీవ్రంగా దెబ్బతీసిందని మల్లికార్జున ఖర్గే ఆవేదన వ్యక్తం చేశారు.

Congress Can t Return to Power in Telangana Kharge s Shocking Critique on Revanth Reddy

బీసీ రిజర్వేషన్ అంశాన్ని రేవంత్ రెడ్డి సరిగ్గా హ్యాండిల్ చేయకపోవడం వల్ల పార్టీ పరిస్థితి రెండిటికి చెడ్డ రేవడి లా తయారైందని మల్లికార్జున ఖర్గే అభిప్రాయపడ్డారు. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్న రెడ్లు, దళితులు ఈ వైఫల్యం కారణంగా దూరమయ్యారు. పోనీ, బీసీలు అయినా దగ్గరయ్యారా అంటే అదీ లేదు. రేవంత్ నిర్వాకం వల్ల అన్ని కులాల ప్రజలు కాంగ్రెస్ పట్ల ఆగ్రహంతో ఉన్నారని మల్లికార్జున ఖర్గే తనతో భేటీ అయిన ఎమ్మెల్యేలతో మాట్లాడినట్టు తెలుస్తోంది.

అన్నిటికంటే ముఖ్యంగా... అనవసరంగా ఈ వివాదంలో రాహుల్ గాంధీ పేరును లాగడం వల్ల ఆయన ఇమేజ్ కూడా దెబ్బతిందని ఖర్గే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.రేవంత్ రెడ్డి మొదటి నుంచీ పార్టీలో అందరినీ కలుపుకొని పోలేదు. ఇతర పార్టీలతో కూడా సరిగ్గా సమన్వయం చేసుకోలేకపోయారు.ఈ విషయాలన్నీ విశ్లేషించిన తర్వాత, ఖర్గే అంతర్గత సమావేశంలో తెలంగాణలో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రావడం అసాధ్యం అనే తీవ్ర వ్యాఖ్య చేసినట్లు సీనియర్ జర్నలిస్ట్ వాసు వెల్లడించారు.

కేవలం ఆరు నెలల్లోనే జాతీయ అధ్యక్షుడి నుంచి ఇంత తీవ్రమైన వ్యాఖ్యలు రావడం, అంతర్గత కుమ్ములాటలతో కాంగ్రెస్ ప్రభుత్వం పలచన అవుతున్న తీరుపై ఈ వ్యాఖ్యలు అద్దం పడుతున్నాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తన వైఫల్యాలను సరిదిద్దుకుని, పార్టీని తిరిగి గాడిన పెట్టగలదా లేదా అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+