రాజ్యసభ ఎన్నికల వేళ రేవంత్ కొత్త స్కెచ్, ఆట మొదలు - టార్గెట్ కేసీఆర్..!?
తెలంగాణలో రాజ్యసభ స్థానాల ఎన్నికలకు రంగం సిద్దం అవుతోంది. ఇప్పటికే ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. మూడు స్థానాలకు జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ కు రెండు, బీఆర్ఎస్ కు ఒకటి దక్కాల్సి ఉంది. అయితే, కాంగ్రెస్ మూడు స్థానాలకు పోటీ చేస్తే మొత్తంగా తెలంగాణ రాజకీయమే మారే అవకాశం కనిపిస్తోంది. లోక్ సభ ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ బీఆర్ఎస్ కు షాక్ ఇచ్చేలా కాంగ్రెస్ నిర్ణయాలు ఉంటాయనే చర్చ మొదలైంది.
ఏకగ్రీవం అయ్యేనా
తెలంగాణలో పదవీ విరమణ చేయనున్న ముగ్గురు రాజ్యసభ ఎంపీల స్థానంలో కొత్త వారి ఎంపికకు వీలుగా ఎన్నికల షెడ్యూల్ విడుదల అయింది. ప్రస్తుతం సభలో ఉన్న పార్టీల సంఖ్యా బలం ఆధారంగా కాంగ్రెస్ పార్టీకి రెండు స్థానాలను కైవసం చేసుకోవటం ఖాయంగా కనిపిస్తుంది. ఇక బీఆర్ఎస్ ఒక స్థానాన్ని గెలుచుకునే ఛాన్స్ ఉంది. కాంగ్రెస్ రెండు, బీఆర్ఎస్ ఒక్క స్థానం కోసం పోటీకి సిద్దమైతే పోలింగ్ అవసరం లేకుండానే దాదాపుగా ఏకగ్రీవానికి ఛాన్స్ ఉంటుంది. కాంగ్రెస్ మూడో అభ్యర్దిని బరిలో దించితే మాత్రం లెక్కలు మారిపోనున్నాయి. ప్రస్తుతం సభలో కాంగ్రెస్ కు 64, మిత్రపక్షంగా ఉన్న సీపీఐ 1 సీటు గెలవటంతో వారి బలం 65కు చేరింది. భారత రాష్ట్ర సమితి 39 స్థానాలకు గెలుచుకొని రెండో స్థానంలో ఉంది. బీజేపీ 8, ఎంఐఎం 7 స్థానాల్లో పాగా వేసింది.

ఎన్నిక తప్పదా
ప్రస్తుత బలాల ఆధారంగా కాంగ్రెస్ రెండు స్థానాలు గెలుచుకోవటం సులభమే. మూడో స్థానం దక్కాలంటే బీఆర్ఎస్ నుంచి క్రాస్ ఓటింగ్ జరిగితేనే సాధ్యపడుతుంది. రాజ్యసభ ఎన్నికలకు విప్ వర్తించదు. కానీ, సభ్యుడు పార్టీ ఎన్నికల ఏజెంట్ కు ఓటు చూపించి వేయాల్సి ఉంటుంది. అనర్హత వేటుకు అవకాశం ఉండదు. కొద్ది రోజులుగా గులాబీ పార్టీ నేతలు వరుసగా సీఎం రేవంత్ ను కలుస్తున్నారు. త్వరలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ సమయంలో మాజీ సీఎం కేసీఆర్ కు షాక్ ఇచ్చేలా రేవంత్ మూడో అభ్యర్దిని బరిలోకి దించే అవకాశం ఉందనే చర్చ కాంగ్రెస్ లో పెద్ద ఎత్తున జరుగుతోంది. ద్వితీయ ప్రాధాన్యత ఓటు ఇక్క కీలకంగా మారనుంది. ఈ విషయంలో బీఆర్ఎస్ కూడా అప్రమత్తంగా ఉంది. లోక్ సభ ఎన్నికల వేళ పార్టీపై ప్రభావం పడకుండా.... జాగ్రత్తలను తీసుకునే పనిలో పడింది. పోలింగ్ అనివార్యం అయితే ఎంఐఎం నిర్ణయం మరింత కీలకం కానుంది.
ఛాన్స్ దక్కేదెవరికి
ఇక, కాంగ్రెస్ నుంచి రాజ్యసభ రేసులో సీనియర్లు ఉన్నారు. బీసీ కోటాలో సీనియర్ వీ హన్మంతరావు గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయనే కాకుండా గత ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న జానారెడ్డి, చిన్నారెడ్డి కూడా రేసులో ఉన్నారు. అలంపూర్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన సంపత్ కుమార్ కూడా ఈ సీటు కోసం ప్రయత్నిస్తున్నారు. హైకమాండ్ కోటాలో ఒక సీటు కేటాయించనున్నారు. మూడు సీట్లకు పోటీ చేస్తే ఇద్దరు స్థానిక నేతలు బరిలో ఉంటారు. రాష్ట్రం నుంచి రాజ్యసభకు పోటీ చేయాలని టీపీసీసీ ఇప్పటికే తీర్మానం చేసింది. పార్టీలో చర్చ సాగుతున్నట్లుగా కాంగ్రెస్ మూడో అభ్యర్దిని బరిలోకి దించితే మాత్రం తెలంగాణలో రాజకీయంగా కలకలం ఖాయంగా కనిపిస్తోంది.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications