మున్సిపల్ ఎన్నికల్లో ఏ స్థానంలో ఎవరిది గెలుపు, లెక్క పక్కా..!!

హోరా హోరీగా సాగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాల పైన స్పష్టత వస్తోంది. పోలింగ్ సరళి తరువాత పార్టీలు లెక్కల్లో మునిగిపోయారు. కార్పోరేషన్లు.. మున్సిపాల్టీల్లో పోలింగ్ జరిగిన తీరు... పోలింగ్ శాతం.. ఎంత మేర తాము నమ్ముకున్న ఓటర్లు ఓటింగ్ లో పాల్గొన్నారు... పోల్ మేనేజ్ మెంట్ పైనా సమీక్ష చేస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ ఇచ్చిన లెక్కలను బేరీజు వేస్తున్నారు. అంతిమం గా ఫలితాల పైన ఒక అంచనాకు వచ్చారు. పోలింగ్ జరిగిన తీరు పైన విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కాంగ్రెస్ మాత్రం 80 శాతం సీట్ల గెలుపుతో ధీమాగా కనిపిస్తోంది.

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోరు ముగిసింది. ఈ నెల 13న ఓట్ల లెక్కింపు జరగనుంది. దీనికి ముందే పార్టీలు పోలింగ్ సరళికి అనుగుణంగా గెలుపు ఓటముల పైన ఒక అంచనాలకు వస్తున్నాయి. ఎగ్జిట్ పోల్స్ సైతం తమ అంచనాలు వెల్లడించాయి. పోలింగ్ తీరు పైన సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటనలో పార్టీ అధ్యక్షుడు ఖర్గేకు నివేదిక ఇచ్చారు. 80 శాతం పైగా స్థానాలను పార్టీ గెలువబోతోందని చెప్పినట్లు సమాచారం. అదే విధంగా ఎగ్జిట్ పోల్స్ సైతం కాంగ్రెస్ కే అధికంగా సీట్లు వస్తాయని వెల్లడించాయి. అధికార పార్టీ అక్రమాలకు పాల్పడిందని బీఆర్ఎస్, బీజేపీ నేత లు ఆరోపిస్తున్నారు. ఇదే సమయంలో రెండేళ్ల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి పట్టణ ఓటర్లు తమకే పట్టం కడతారని అధికార పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. 116 మున్సిపాలిటీ లు, 7 మున్సిపల్ కార్పొరేషన్లలో జరిగిన ఎన్నికల్లో 80 శాతానికి పైగా స్థానాలు దక్కుతాయని కాంగ్రెస్‌ విశ్వాసం వ్యక్తం చేస్తోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు దగ్గరగానే ఫలితాలు ఉంటాయని ఆ పార్టీ నేతలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

congress-confident-over-winning-majority-corporations-municipalities-in-recent-elections-as-polling

మెదక్ జిల్లా మినహా అన్నింటా కాంగ్రెస్ ఆధిక్యం

ఉమ్మడి మెదక్, వరంగల్ జిల్లాల్లో బీఆర్ఎస్,-కాంగ్రెస్ మధ్య గట్టి పోటీ నెలకొన్నట్లు భావిస్తు న్నారు. పుర పోరు ప్రకటన వెలువడిన సమయం నుంచి ప్రచారం వరకు కాంగ్రెస్ పక్కా వ్యూహం తో ముందుకు సాగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగి, పలు జిల్లాల్లో ప్రచార సభల్లో పాల్గొన్నారు. సీఎం అమెరికాలో ఉన్నప్పటికీ జూమ్ మీటింగ్‌ల ద్వారా పార్టీ నేతలతో నిత్యం సమీక్షలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేశారు. ఉమ్మడి నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో క్లీన్ స్వీప్ చేసే అవకాశాలు ఉన్నాయని తేల్చి చెబుతున్నారు. ఖమ్మం జిల్లాలోనూ ఏకపక్ష ఫలితాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయని అంచనా వేస్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా మినహా అన్ని జిల్లాల్లోనూ పార్టీకి అనుకూలత ఉందని నేతలు చెబుతున్నారు. ఎన్నికలు జరుగుతున్న మొత్తం 116 మున్సిపాలిటీల్లో హస్తం పార్టీ ఏకంగా 84 గెలుచుకోనుంది. ఇక ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ 26, బీజేపీ 5, ఎంఐఎం ఒక్క మున్సిపాల్టీ గెలుచుకునే అవకాశం ఉందని తాజాగా కాంగ్రెస్ నేతల అంచనా. మెదక్‌లో బీఆర్‌ఎస్‌ అత్యధిక మున్సిపాలిటీలు గెలిచే అవకాశం ఉందని విశ్లేషణలు చేస్తున్నారు. దీంతో.. అధికారిక ఫలితాల పైన ఉత్కంఠ కొనసాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+