వెంకట్రామి రెడ్డి ని నిలువరించేందుకు కాంగ్రెస్ గట్టి పోరాటం.!అసెంబ్లీ సెక్రెటరీతో పాటు ఈసీకి ఫిర్యదు.!
హైదరాబాద్ : మండలి టిఆర్ఎస్ అభ్యర్థి, మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డి పై కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేసారు. అసెంబ్లీలో మండలి రిటర్నింగ్ ఆఫీసర్ తో భేటీ ఐన కాంగ్రెస్ ముఖ్య నేతలు, మాజీ ఐఏఎస్ వెంకట్రామి రెడ్డి ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాన్ని పూర్తిగా వ్యతిరేకించారు. మండలి రిటర్నింగ్ అధికారికి సైతం వెంకట్రామి రెడ్డి అవినీతి కోణంలో పై ఫిర్యాదు చేసారు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి వెంట సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీమంత్రి షబ్బీర్ అలీ తదితరులు ఉన్నారు.

రాజ్యంగ వ్యవస్థలను అవహేళన చేస్తున్నారు
వెంకట్రామిరెడ్డి నామినేషన్ ను తిరస్కరించాలని, ఐఏఎస్ గా పలు అవినీతి ఆరోపణలు, విచారణ సంస్థల విచారణలు, కోర్ట్ ధిక్కార కేసులను వెంకట్రామి రెడ్డి ఎదుర్కొంటున్నారని కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేసారు. అంతే కాకుండా మాజీ ఐఏఎస్ అదికారి వెంకటరామి రెడ్డి పై సీబీఐ తోపాటు అనేక కేసులు ఉన్నాయని, వెంట్రామిరెడ్డి రాజీనామాను ఒక్క రోజు లోనే ఆమోదించడం జుగుప్సాకరమన్నారు కాంగ్రెస్ నేతలు. వెంకట్రమిరెడ్డి పై ఫిర్యాదు చేసామని, నామినేషన్ పత్రాల పరిశీలనకు అవకాశం ఇవ్వాలని కోరినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేసారు.

వెంకట్రామిరెడ్డి నామినేషన్ వివరాలు ఇవ్వండి..
రాజీనామా చేసిన వెంటనే టీఆరెస్ లో చేరిపోవడం ఎంత వరకు సమంజసమని వారు ప్రశ్నిస్తున్నారు. అప్పట్లోనే సీఎం చంద్రవేఖర్ రావు కాళ్లు మొక్కి గౌరవ ప్రధమైన మెజిస్ట్రేట్ వృత్తి పరువు తీసాడని మండిపడ్డారు. ఒక అధికారిగా పూర్తి స్థాయిలో టీఆరెస్ కి పనిచేశాడని, కేసులపై స్పష్టత ఇవ్వకుండా రాజీనామా ఎలా చేస్తారని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. వెంకట్రామిరెడ్డి నామినేషన్ వేసిన విధానం కూడా పద్ధతి ప్రకారం లేదని, అప్లికేషన్ కూడా కరెక్ట్ గా లేదని, వెంకట్రామిరెడ్డి నామినేషన్ తిరస్కరించి, అతని అవినీతిపై చర్యలు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది.

రిటర్నింగ్ అధికారులు టీఆర్ఎస్ కు కొమ్ముకాస్తున్నారు..
అంతే కాకుండా నిబంధనలు ఉల్లంఘించి సీఎం చంద్రశేఖర్ రావు ఇస్టా రాజ్యాంగ వ్యవహరిస్తున్నాడని పీసిసి ఛీఫ్ రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. నామినేషన్ వేసిన పత్రాలను ఏరోజుకు ఆరోజు ఆన్ లైన్ లో పెట్టాలి. కాని నామినేషన్ పత్రాలను ఆన్ లైన్ లో పెట్టడం ద్వారా, అభ్యర్థులు ఏవైనా తప్పుడు సమాచారం ఇస్తే, అభ్యంతరాలు చెప్పేందుకు అవకాశం ఉంటుందని రేవంత్ తెలిపారు. నామినేషన్ పత్రాల వివరాలు ఇవ్వాలని అడిగితే, రిటర్నింగ్ అధికారి స్పందించడం లేదని రేవంత్ ఆరోపించారు. ఎన్నికల అధికారులు టిఆర్ఎస్ కు సహాకరిస్తున్నారని ఘాటు విమర్శలు చేసారు రేవంత్ రెడ్డి.

వెంకట్రామి రెడ్డిపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యదు..
నిబంధనల ప్రకారం ఎన్నికలు నిర్వహించాలి గానీ ఏకపక్షంగా నిర్వహించడం అంటే ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేసినట్టేనని రేవంత్ మండిపడ్డారు. టిఆర్ఎస్ పార్టీ కనుసన్నల్లోనే ఎన్నికలు జరుగుతున్నాయని, పరిస్థితిలో మార్పు లేక పోతే ద్ర ఎన్నికల అధికారి కి ఫిర్యాదు చేస్తామని రేవంత్ రెడ్డి హెచ్చరించారు.
ఎన్నికల అధికారులు సరైన విధంగా స్పందించకపోతే, న్యాయస్థానం తలుపుతడుతామన్నారు రేవంత్. వెంకట్రమిరెడ్డి రాజీనామాను కేంద్ర ప్రభుత్వం ఆమోదించాలని, చాలా రోపణలు, ఫిర్యాదు లు వెంకట్రమిరెడ్డిపై ఉన్నాయని, డీవోపీటీ ఆమోదించిన తర్వాతే, వెంకట్రామిరెడ్డి నామినేషన్ ను ఆమోదించాలని రిటర్నింగ్ అధికారిని కోరామని రేవంత్ రెడ్డి స్పష్టం చేసారు. ఇంత జరుగుతున్నా ఎన్నికల అధికారులు సమాచారాన్ని దాచి పెడుతున్నట్లుగా స్పష్టమైన సంకేతాలు వెలువడుతున్నాయని రేవంత్ అసంతృప్తిని వ్యక్తం చేసారు.
-
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ? -
ఆర్టీసీ బస్సుల బంద్ - జేఏసీ కీలక పిలుపు..!!












Click it and Unblock the Notifications