హైదరాబాద్, కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థులు వీరే: ఖమ్మంలో హీరో వెంకటేష్ వియ్యంకుడు

తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న మూడు లోక్‌సభ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ ఎట్టకేలకు అభ్యర్థులను ప్రకటించింది. వీరిలో ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గం అభ్యర్థిగా రామసహాయం రఘురాం రెడ్డి, కరీంనగర్‌ అభ్యర్థిగా రాజేందర్‌ రావు, హైదరాబాద్‌ అభ్యర్థిగా మహమ్మద్‌ సమీర్‌లను ప్రకటించింది. ఈమేరకు ఏఐసీసీ బుధవారం రాత్రి తుదిజాబితాను ప్రకటించింది.

మరోవైపు త్వరలో జరగబోయే ఖమ్మం-నల్గొండ-వరంగల్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికకు, కాంగ్రెస్‌ అభ్యర్థిగా తీన్మార్‌ మల్లన్నను ప్రకటించింది. కాగా, గత కొన్ని రోజులుగా పైమూడు లోక్‌సభ స్థానాలకు అభ్యర్థుల ఖరారు సస్పెన్స్‌లో ఉన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఖమ్మం స్థానం నుంచి అభ్యర్థి ఎంపిక, అధిష్ఠానానికి తలనొప్పిగా మారింది.

congress finalised candidates for the pending lok sabha seats in khammam karimnagar and hyderabad

ఖమ్మం స్థానం నుంచి హేమాహేమి నాయకులు తమ కుటుంబసభ్యుకు కేటాయించాల్సిందిగా పట్టుబట్టడంతో, టికెట్‌ ఖరారు ఆలస్యమయ్యింది. చివరకు అభ్యర్థి ఎంపిక, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వద్ద బెంగళూరులో పంచాయితీ ముగిసింది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డితో ఖర్గే సమావేశమయ్యారు. రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇంఛార్జీ దీపాదాస్‌ మున్షీ సైతం ఈ సమావేశంలో పాల్గొన్నారు.మొదట ఇద్దరితో వేర్వేరుగా, తర్వాత ఇద్దరితో కలిపి చర్చించారు. తొలుత ఉప ముఖ్యమంత్రి భట్టి, తన సతీమణికి టికెట్‌ ఇవ్వాలని కోరగా అందుకు ఖర్గే అంగీకరించలేదు.

ఈ క్రమంలో మంత్రి పొంగులేటి కుటుంబ సభ్యులకు కాకుండా మరో సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి ఇవ్వాలని జిల్లాకు చెందిన రాయల నాగేశ్వర రావు పేరు సూచించినట్లు తెలిసింది. అయితే, కాంగ్రెస్‌లో చేరినప్పుడు తాను సూచించిన వ్యక్తికి లోక్‌సభ టికెట్‌ ఇస్తామని హామీ ఇచ్చారని ఖర్గేతో పొంగులేటి తేల్చి చెప్పారు. సోదరుడు ప్రసాద రెడ్డికి టికెట్‌ ఇవ్వాలని పట్టుపట్టినట్లు సమాచారం. పార్టీ నాయకులు రఘురామిరెడ్డి పేరును తెరమీదకు తెచ్చారన్న పొంగులేటి.. ఆయనతో బంధుత్వం ఇటీవల కాలంలోనే ఏర్పడిందని చెప్పినట్లు తెలిసింది.

తర్వాత ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖర్గేతో ఫోన్‌లో మాట్లాడినట్లు తెలిసింది. పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నిర్ణయానికి కట్టుబడి ఉంటానని, పార్టీ అభ్యర్థి విజయానికి కృషి చేస్తానని చెప్పినట్లు సమాచారం. చివరకు ఖమ్మంనకు రఘురామిరెడ్డిని ఎంపికచేశారు. ఇక కరీంనగర్‌కు వెలిచాల రాజేందర్‌రావు, హైదరాబాద్‌కు షమీవలీ ఉల్లా పేర్లను ప్రకటించారు. కాగా, ఖమ్మం అభ్యర్థి రఘురామిరెడ్డి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, టాలీవుడ్ హీరో వెంకటేశ్ లకు వియ్యంకుడు కావడం గమనార్హం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+