రాజ్యసభ అభ్యర్ధుల ఖరారులో బిగ్ ట్విస్ట్ - వైఎస్ బాటలో రేవంత్..!!
తెలంగాణ నుంచి రాజ్యసభకు ఎవరికి ఛాన్స్ దక్కుతుంది. కొద్ది రోజులుగా రాష్ట్ర రాజకీయాల్లో ఇదే అంశం పైన చర్చ సాగుతోంది. ప్రస్తుతం అసెంబ్లీలో ఉన్న లెక్కల ప్రకారం రెండు స్థానాలు అధికార కాంగ్రెస్ కు దక్కే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటి వరకు ఒక స్థానం తిరిగి అభిషేక్ సింఘ్వీ కి రెన్యువల్ చేస్తారని.. రెండో స్థానంలో జస్టిస్ సుదర్శన్ రెడ్డికి ఛాన్స్ దక్కుతుందనే ప్రచారం పార్టీ లో జరిగింది. అయితే, సీఎం రేవంత్ - పార్టీ హైకమాండ్ తో చర్చల వేళ ఈ అంచనాల్లో మార్పు జరిగినట్లు సమాచారం. అదే సమయంలో రాజ్యసభకు పోటీ విషయంలో బీఆర్ఎస్ నిర్ణయం సైతం కీలకంగా మారుతోంది.
తెలంగాణ నుంచి రెండు రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల అయింది. కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ సింఘ్వీ, బీఆర్ఎస్ ఎంపీ సురేశ్ రెడ్డి పదవీ కాలం ముగియటంతో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. మార్చి 16న పోలింగ్ జరగనుంది. ప్రస్తుతం అసెంబ్లీలో ఉన్న పార్టీల బలం ఆధారంగా రెండు స్థానాలు కాంగ్రెస్ కు దక్కటం ఖాయంగా కనిపిస్తోంది. ఒక్కో అభ్యర్థి గెలవడానికి దాదాపు 40 నుంచి 41 మొదటి ప్రాధాన్యత ఓట్లు అవసరం. అసెంబ్లీలో కాంగ్రెస్‌కు ఉన్న 64 మంది స్వంత ఎమ్మెల్యేలతో పాటు, ఇతర పార్టీల నుండి చేరిన వారితో కలిపి మొత్తం బలం 75 దాటడంతో, ఇద్దరు అభ్యర్థులను గెలిపించుకోవడానికి అవసరమైన 82 ఓట్లకు కాంగ్రెస్ సమీపం లో ఉంది. మజ్లిస్ మద్దతు ఎటూ కాంగ్రెస్ పార్టీకే లభిస్తుంది. అందుకే రెండు స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకోవటం దాదాపు ఖాయంగా ఉంది. అయితే, బీఆర్ఎస్ ఏం చేస్తుందనేది ఇప్పుడు కీలకంగా మారుతోంది. బీఆర్ఎస్ నుంచి పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కు దగ్గరయ్యారు. దీంతో, ఆ పార్టీకి ప్రస్తుతం ఉన్న 27 మంది బలం సరిపోదు. కాగా.. ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్న బీజేపీ ఓటింగ్ కు హాజరు కాకపోవచ్చనే అంచనాలు ఉన్నాయి.

సామాజిక సమీకరణాలకే ప్రాధాన్యం
దీంతో..రెండు స్థానాల విషయంలో కాంగ్రెస్ నాయకత్వం ఒకటి తిరిగి సింఘ్వీకి రెన్యువల్ చేయాలని నిర్ణయించింది. రెండో స్థానం విషయంలో చర్చించి నిర్ణయం తీసుకుందామని తాజాగా ఢిల్లీ పర్యటన సమయంలో సీఎం రేవంత్ కు పార్టీ చీఫ్ ఖర్గే సూచించారు. ఉప రాష్ట్రపతి అభ్యర్ధి గా పోటీ చేసిన జస్టిస్ సుదర్శన్ రెడ్డితో పాటుగా కొందరి పేర్లు తెర మీదకు వచ్చాయి. సీనియర్ నేత వీహెచ్ తో పాటుగా మాజీ మధు యాష్కీ, సీఎం సలహాదారు వేం నరేంద్ర రెడ్డి పేర్లు పరిశీలన లో ఉన్నట్లు తెలుస్తోంది. వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో తన మిత్రుడు.. తనకు పాలనలో సహాయ సహకారాలు అందించిన కేవీపీ రామచంద్ర రావుకు రాజ్యసభ సీటు కోసం హైకమాండ్ ను ఒప్పించి ఇప్పించారు. ఇప్పుడు రేవంత్ సైతం వేం నరేంద్ర రెడ్డి కోసం అదే తరహాలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. దీంతో.. రాజ్యసభ అభ్యర్ధుల విషయంలో హైకమాండ్ చివరికి ఎవరిని ఎంపిక చేస్తుందనేది ఆసక్తి కరంగా మారుతోంది.
-
తెలంగాణలో ముగిసిన రాజ్యసభ అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియ.. -
వైసీపీ కొత్త రీజినల్ కోఆర్డినేటర్లు వీరే- ఇకపై -
Kavitha: కవిత నోట 'జై ఆంధ్ర' నినాదం-తిరుపతిలో కీలక వ్యాఖ్యలు..! -
బెంగాల్ గవర్నర్ రాజీనామా.. షాక్ లో దీదీ..! -
వైసీపీకి స్పీకర్ తాజా షాక్-త్వరలో నోటీసులు-జగన్ పై క్లారిటీ..! -
సీఎం పదవికి రాజీనామా! బీహార్ తదుపరి ముఖ్యమంత్రి ఎవరు? -
లడ్డు వ్యవహారం హిందూ ధర్మంపై జరిగిన ఆర్గనైజ్డ్ క్రైమ్.. -
వైఎస్ ఫార్ములాతో రేవంత్, హైకమాండ్ ఫ్లాట్ - నాడు కేవీపీ.. నేడు వేం..!! -
"మీరు క్రిస్టియన్.. కాదు నేను హిందువు": మండలిలో మతాల రచ్చ -
అవిశ్వాసానికి వేళాయే!: ఛైర్మన్‌కు చెక్ పెట్టేందుకు సిద్ధమైన ఎమ్మెల్సీలు! -
బీజేపీ ఆపరేషన్ బీహార్ సక్సెస్, ఇక నెక్స్ట్ టార్గెట్.. ఫిక్స్..!! -
పనిలో పని.. పాకిస్థాన్ నూ లేపేస్తే పోలా..!! -
జాక్‌పాట్ కొట్టిన సంజు శాంసన్..!! -
పాతాళానికి దిగజారుతున్న బంగారం ధరలు -
బాలయ్య - గోపీచంద్ మలినేని మూవీలో విలన్‌గా మంచు హీరో..!













Click it and Unblock the Notifications