బిగ్ అప్డేట్, రొటేషన్ మంత్రివర్గం - హైకమాండ్ క్లారిటీ..!!

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరుతోంది. రేవంత్ ముఖ్యమంత్రిగా మరో 11 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. కాంగ్రెస్ అధినాయకత్వం హైదరాబాద్ చేరుకుంది. మంత్రివర్గంలో ఎవరికి అవకాశం దక్కనుంది ఇప్పటికే ఖరారు చేసారు. ఇదే సమయంలో మరి కొంత మంది మంత్రివర్గంలో స్థానం ఆశించారు. వారికి తాజాగా హైకమాండ్ నుంచి వస్తున్న సంకేతాలు ఆసక్తి కరంగా మారాయి. ప్రస్తుత కేబినెట్ పైన కొత్త చర్చ మొదలైంది.

ప్రమాణ స్వీకారం వేళ : ముఖ్యమంత్రిగా రేవంత్ ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. సీఎంగా రేవంత్..11 మంది మంత్రులు ప్రమాణ స్వీకారానికి రంగం సిద్దమైంది. ఈ రోజు ప్రమాణం చేసే వారి జాబితాలో కొండా సురేఖ , కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి , జూపల్లి కృష్ణ రావు , భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీతక్క, శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దామోదర రాజనర్సింహలు ఉన్నారు. తెలంగాణలో 18 మంది వరకు మంత్రులు ఉండే అవకాశం ఉంది. అయితే, మిగిలిన ఆరుగురు మంత్రుల ఎంపిక రెండు రోజుల్లో పూర్తి కానుంది. ప్రస్తుతం ప్రమాణ స్వీకారం చేస్తున్న వారిలో ముగ్గురు మినహా మిగిలిన వారంతా గతంలో మంత్రులుగా పని చేసిన అనుభవం ఉన్న వారిని ఎంపిక చేసారు.

Congress high command hints on Rotation cabinet in Telangana, As Reports

రెండున్నారేళ్ల టైం : అయితే, మంత్రి పదవులు రాని వారికి హైకమాండ్ నుంచి వస్తున్న సంకేతాలు ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వం ఏర్పాటు తరువాత అనేక సవాళ్లు ఉన్నాయని...దీంతో, సీనియర్లకు ప్రాధాన్యత ఇస్తున్నామని హైకమాండ్ చెప్పినట్లు తెలుస్తోంది. గ్యారంటీల అమలు..లోక్ సభ ఎన్నికలు...ఆర్దిక పరిస్థితుల నిర్వహణ కోసం అనుభవం ఉన్న వారినే ఎంపిక చేసామని చెబుతున్నారు. మిగిలిన ఆరు మంత్రి పదవులకు సంబంధించి ఇప్పుడు అవకాశం దక్కని నిజామాబాద్, అదిలాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ నుంచి అవకాశం దక్క నుంది. అదే విధంగా ఇప్పుడు అవకాశం దక్కని సామాజిక వర్గాలకు ఛాన్స్ ఇస్తారని చెబుతున్నారు. వచ్చే వారమే మరోసారి ఆరుగురుతో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని సమాచారం.

Congress high command hints on Rotation cabinet in Telangana, As Reports

రొటేషన్ మంత్రివర్గం : ప్రస్తుతం ఇచ్చిన మంత్రుల పని తీరు...ఇతరులకు అవకాశం కల్పించటం కోసం రెండున్నారేళ్లు డెడ్ లైన్ గా పెట్టుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. గతంలో ఏపీలో జగన్ ప్రభుత్వం సైతం ఇదే ఫార్ములా అమలు చేసింది. కొందరు సీనియర్లను కొనసాగిస్తూ..కొత్త వారికి అవకాశం కల్పించారు. ఇప్పుడు తెలంగాణలోనూ ఇదే ఫార్ములా అమలు చేసే అవకాశం ఉందని మంత్రి పదవుల రేసులో ఉన్న నేతలు చెబుతున్నారు. దీంతో..మంత్రి పదవులు దక్కించుకున్న నేతలు తమ సమర్ధతను నిరూపించుకోవాల్సి ఉందనేది స్పష్టం అవుతోంది. కాంగ్రెస్ వీడి బీజేపీలోకి వెళ్లి..మళ్లీ కాంగ్రెస్ లో చేరి ఎమ్మెల్యేలుగా గెలిచిన ఇద్దరికి మంత్రివర్గ విస్తరణలో అవకాశం ఇస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+