Congress List: కాంగ్రెస్ తుది జాబితా.. బీసీలకు అన్యాయమేనా..!
లోక్ సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో పార్టీలు ప్రచారానికి సిద్ధమవుతున్నాయి. తెలంగాణకు సంబంధించి ప్రధాన పార్టీలు అభ్యర్థులను ప్రకటించాయి. బీజేపీ ఇప్పటికే 17 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. అటు బీఆర్ఎస్ కూడా 17 మంది అభ్యర్థుల పేర్లు ప్రకటించింది. కాంగ్రెస్ మాత్రం కేవలం 9 నియోజకవర్గాలకు మాత్రమే అభ్యర్థులను ప్రకటించింది. ఇంకా 8 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. రెండు, మూడు రోజుల్లో కాంగ్రెస్ మిగిలిన అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది.
అభ్యర్థుల ఎంపికకు సంబంధించి కసరత్తు కొనసాగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. వారు కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో పాల్గొననున్నారు. అలాగే అభ్యర్థుల ఎంపికపై కూడా చర్చించే అవకాశం ఉంది. అధిష్ఠానం అభ్యర్థుల ఎంపికకు సంబంధించి రాష్ట్రాలకు చెందిన నేతలు, ఎమ్మెల్యేల అభిప్రాయాలను స్వీకరిస్తోంది. వారు ప్రతిపాదించిన సూచనల మేరకు అభ్యర్థులను పరిశీలించి ఫైనల్ లిస్టును సీఈసీకి పంపించనుంది.

నిజామాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి పేరు ఖరారైనట్లుగా వార్తలు వస్తున్నాయి. మెదక్ నియోజకవర్గం నుంచి బీసీ ముదిరాజు సామాజిక వర్గానికి చెందిన నీలం మధు బరిలో దించే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. భువనగిరి స్థానంపై సస్పెన్షన్ కొనసాగుతోంది. భువనగిరి టికెట్ బీసీ ఇవ్వాలని డిమాండ్ పెరుగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి మాత్రం టీపీసీసీ ఉపాధ్యక్షుడు చామల కిరణ్ కుమార్ రెడ్డికి మద్దతు ఇస్తున్నట్లు తెలుస్తోంది. వరంగల్ నుంచి పసునూరి దయకార్, ఖమ్మం పొంగులేటి ప్రసాద్ రెడ్డి పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
హైదరాబాద్ కు సంబంధించి టికెట్ ఎవరికి ఇవ్వాలనే దానికి చర్చలు కొనసాగుతోన్నాయి. ఫిరోజ్ ఖాన్ బరిలో దించే అవకాశం కనిపిస్తోంది. అయితే కాంగ్రెస్ గౌడ సామాజిక వర్గానికి సంబంధించి ఒక్క టికెట్ కూడా ఇవ్వకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. బీజేపీ బూర నర్సయ్య గౌడ్, బీఆర్ఎస్ పద్మారావు గౌడ్ కు అవకాశం కల్పించాయి. దీంతో భువనగిరి స్థానాన్ని గౌడ్లకు కేటాయించాలని డిమాండ్ పెరుగుతోంది.












Click it and Unblock the Notifications