కెసిఆర్‌కు వ్యతిరేకంగా రెడ్లు ఏకం కావాలి: జగ్గారెడ్డి సంచలనం
సంగారెడ్డి: తెలంగాణలో రెడ్డి కులస్తులు ఏకమై కేసీఆర్‌కు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని టీపీసీసీ అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అభిప్రాయపడ్డారు. తెలంగాణ టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి కూడ గతంలో తెలంగాణ సిఎం కెసిఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు.
ఒక సామాజికవర్గాన్ని లక్ష్యంగా చేసుకొని కెసిఆర్ ఇబ్బందులు సృష్టిస్తున్నాడని ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలకు ఊతమిచ్చేలా కెసిఆర్‌పై జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనం కల్గిస్తున్నాయి.
తెలంగాణలో కెసిఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చోటుచేసుకొన్న పరిణామాలు రెడ్డి సామాజిక వర్గానికి ఇబ్బంది కల్గించేలా ఉన్నాయని కొందరు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలు బహిరంగంగానే వ్యాఖ్యలు చేశారు.
ఈ విమర్శల నేపథ్యంలో కెసిఆర్ కూడ జాగ్రత్తలు తీసుకొన్నారు. రెడ్డి సామాజికవర్గానికి దగ్గరయ్యే ప్రయత్నం చేశారు.పోలీస్ అకాడమీకి రాజబహద్దూర్ వెంకటరామిరెడ్డి పేరును పెట్టారు. రెడ్డి హస్టల్‌కు సకల సౌకర్యాలు కల్పిస్తామని హమీ ఇచ్చారు.

కెసిఆర్‌పై జగ్గారెడ్డి ఆరోపణలు
తెలంగాణలో రెడ్డి కులస్తులు ఏకమై కేసీఆర్‌కు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని టీపీసీసీ అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అభిప్రాయపడ్డారు.తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డిపై ఇటీవల మీడియా సమావేశంలోనే కెసిఆర్ దుమ్మెత్తిపోశారు. తెలంగాణలో రెడ్డి సామాజిక వర్గం బలంగా ఉంటుంది. ఆ సామాజిక వర్గాన్ని సంతృప్తిపర్చే పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు మెండుగా ఉంటాయని విశ్లేషకులు అభిప్రాయంతో ఉన్నారు. అయితే తెలంగాణలో అధికారానికి రెడ్డి సామాజిక వర్గం దూరమైందనే భావన ఆ వర్గాల్లో ఉందనే ప్రచారం కూడ రాజకీయవర్గాల్లో సాగుతోందంటున్నారు రాజకీయ పరిశీలకులు.

రెడ్లంతా ఏకమైతే కెసిఆర్ బజారునపడతారు
రాజకీయంగా రెడ్డి సామాజిక వర్గాన్ని అణగదొక్కేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నాడన్నారు. రెడ్డిలంతా ఏకమైతే నీ బతుకు బజారుపాలవుతుందని కేసీఆర్‌ను ఆయన హెచ్చరించారు. రెడ్డి సామాజిక వర్గం పది మందికి సేవ చేసే దృక్పథంతో ఉంటుందన్నారు. అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్న రెడ్డి సామాజిక వర్గం నేతలు జాగ్రత్త పడాలన్నారు. ఎస్సీ, బీసీలతో రెడ్డి కులస్తులకు అవినాభావ సంబంధం ఉందని, వెలమలకు ఎలాంటి సంబంధాలు లేవన్నారు

తెలంగాణ ఉద్యమంలో అన్ని పార్టీల పాత్ర
తెలంగాణ ఉద్యమంలో అన్ని రాజకీయ పార్టీలు ఉద్యమాలు చేశాయని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేత జగ్గారెడ్డి అభిప్రాయపడ్డారు. . జేఏసీ ఏర్పాటు అనంతరం అన్ని ఉద్యోగ, ఉపాధ్యాయ, ప్రజా సంఘాలు.. ఇలా ఉద్యమంలో సకల జనులు భాగస్వామ్యం అయ్యారని జగ్గారెడ్డి గుర్తు చేశారు. టీఆర్‌ఎస్ పార్టీలో వీరంతా చేరి ఏనాడు మద్దతు తెలపలేదన్నారు. రాజకీయేతర పోరాటంతోనే తెలంగాణ సిద్ధిస్తుందని భావించి జేఏసీలో అందరూ చేరారని అన్నారు.

కోదండరామ్ దోపిడిదారుడా?
జేఏసీలో ఉన్నప్పుడు కేసీఆర్‌కు కోదండరాం ముద్దుగా కనిపించాడని, ఇప్పుడు ఆయన దోషిగా కనబడుతున్నాడని, అందుకే ఆయన పర్యటనను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. తెలంగాణ వచ్చిన తర్వాత మహిళలకు, యువతకు, రైతుకు ఏ ఒక్కరికీ న్యాయం జరగలేదన్నారు.












Click it and Unblock the Notifications