పోతిరెడ్డి పాడు వివాదం.. కేసీఆర్-జగన్ చీకటి ఒప్పందాలు... కాంగ్రెస్ నేత సంచలన ఆరోపణలు...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చీకటి ఒప్పందాలు చేసుకున్నారని కాంగ్రెస్ నేత నాగం జనార్దన్ రెడ్డి ఆరోపించారు. జగన్‌తో ఒప్పందం వల్లే తెలంగాణ ప్రజలను కేసీఆర్ మోసం చేస్తున్నారని మండిపడ్డారు. పోతిరెడ్డిపాడు కమిటీ పేరును కృష్ణ నది జలాల పరిరక్షణ కాంగ్రెస్ కమిటీగా మారుస్తున్నామని... త్వరలోనే అన్ని గ్రామాలు తిరిగి కేసీఆర్ లోపాయకారి ఒప్పందాలను బయటపెడుతామని అన్నారు.
కేసీఆర్, జగన్‌లు సమావేశం అయ్యాక కూడా జగన్ సంగమేశ్వర్ ప్రాజెక్టుకు జీఓ ఇచ్చారని, ఏపీ 170 టీఎంసీల నీరు దోచుకుందని ఆరోపించారు. నెల్లూరులో రెండు పంటలు పండించుకున్నారని, మూడో పంటకు సిద్ధం అవుతున్నారని అన్నారు. కృష్ణా నుంచి పెన్నా బేసిన్‌కు ఏపీ ప్రభుత్వం నీటిని తరలిస్తోందని.. కృష్ణాలో మనకు 69 శాతం వాటా ఉందని నాగం గుర్తుచేశారు. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణకు అన్యాయమే జరుగుతోందన్నారు.

Recommended Video
సీఎం కేసీఆర్‌కు నదీ జలాలపై ఏమాత్రం అవగాహన లేదన్నారు.జలయజ్ఞం కింద చేపట్టిన ప్రాజెక్టులు, డిస్టిబ్యూటరీ కెనాల్స్ ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. కృష్ణా నికర జలాలను తెలంగాణ ఎందుకు వాడుకోవడం లేదని మండిపడ్డారు. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుతో దక్షిణ తెలంగాణకు భారీగా నష్టం జరుగుతుందన్నారు.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో












Click it and Unblock the Notifications