వీడియో: ఎన్నికల వేళ.. బీఆర్ఎస్‌లోకి కాంగ్రెస్ సీనియర్ను ఆహ్వానించిన కేటీఆర్

హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు గడువు సమీపిస్తోన్న కొద్దీ ప్రచార జోరు పెరుగుతోంది. అన్ని ప్రధాన పార్టీలు జనంలోకి వెళ్లాయి. ఇంటింటినీ పలకరిస్తోన్నాయి. రోడ్ షోలు, బహిరంగ సభలతో హోరెత్తిస్తోన్నాయి. ఎన్నికల వేడి పతాక స్థాయికి చేరుకుంది.

తెలంగాణలో ఈ నెల 30వ తేదీన పోలింగ్ నిర్వహించనుంది కేంద్ర ఎన్నికల కమిషన్. ఒకే విడతలో ఈ ప్రక్రియ పూర్తవుతుంది. డిసెంబర్ 3వ తేదీన కౌంటింగ్. తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మిజోరంలల్లో అదే రోజు ఓట్లను లెక్కిస్తారు. ఇప్పటికే ఛత్తీస్‌గఢ్‌లో తొలి విడత, మిజోరంలల్లో పోలింగ్ ముగిసింది.

Congress leader Palvai Sravanthi joined BRS

నామినేషన్ల దాఖలు ప్రక్రియ కూడా ముగిసింది. బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ రేవంత్ రెడ్డి.. తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. మొత్తంగా 4,795 నామినేషన్ పత్రాలు దాఖలయ్యాయి. 13వ తేదీన వాటి స్క్రూటినీ ఉంటుంది. నామినేషన్ పేపర్లను ఉపసంహరించుకోవడానికి చివరి తేదీ 15.

ఈ నేపథ్యంలో- కాంగ్రెస్‌కు బిగ్ షాక్ తగిలింది. సీనియర్ నాయకురాలు పాల్వాయి స్రవంతి ఆ పార్టీకి రాజీనామా చేశారు. శనివారమే ఆమె తన తన రాజీనామా పత్రాన్ని పంపించారు. పార్టీకి గుడ్‌బై చెప్పడానికి గల కారణాలను వివరిస్తూ నాలుగు పేజీల లేఖను కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి రాశారు.

Congress leader Palvai Sravanthi joined BRS

టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీకి చరమగీతం పలకడానికి వ్యూహం పన్నారని, అంతం చేయడానికి స్ర్కిప్ట్‌ రాశారని ధ్వజమెత్తారు. పార్టీకి ఉన్న విలువలు, సిద్ధాంతాలకు తిలోదకాలు ఇచ్చారంటూ మండిపడ్డారు. పార్టీని కమర్షియల్‌గా మార్చాడని, ఆ ప్రయత్నంలో తీవ్రంగా నష్టపోయిందని వివరించారు.

అనంతరం పాల్వాయి స్రవంతి.. బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. బీఆర్ఎస్ కార్యాలయంలో ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువాను కప్పుకొన్నారు. బీఆర్ఎస్ విజయం సాధించడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని అన్నారు. కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి అవుతారని చెప్పారు.

పాల్వాయి స్రవంతి సొంత నియోజకవర్గం.. మునుగోడు. గతంలో ఈ స్థానానికి జరిగిని ఉప ఎన్నికలో ఆమె కాంగ్రెస్ అభ్యర్థినిగా పోటీ చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో ఆమె మూడోస్థానంలో నిలిచారు. ఈ ఎన్నికల్లో ఆమె టికెట్ ఆశించారు గానీ.. దాన్ని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కేటాయించింది అధిష్ఠానం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+