టికెట్ల పంచాయితీ, రాహుల్ సీరియస్ - వాళ్లకే కేటాయించండి..!!

మరి కొద్ది రోజుల్లో తెలంగాణ(Telangana) ఎన్నికల షెడ్యూల్(Election schedule) విడుదల కానుంది. బీఆర్ఎస్ ఇప్పటికే అభ్యర్దులను ప్రకటించింది. కాంగ్రెస్ లో మాత్రం సుదీర్ఘ కసరత్తు సాగుతోంది. ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని భావిస్తున్న భావిస్తున్న టికెట్ల పంచాయితీ రాజుకుంటోంది. దీంతో, నేరుగా రాహుల్ గాంధీ(Rahul Gandhi) జోక్యం చేసుకున్నారు. వివాదాల పైన ఆగ్రహం వ్యక్తం చేసారు. టికెట్ల ఖరారు పైన నేతలకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసారు.

కొత్త సమస్యలు : తెలంగాణ కాంగ్రెస్ టికెట్ల ఖరారులో కొత్త సమస్యలు తెర మీదకు వస్తున్నాయి. దిగారు. కుల సమీకరణలు, రాజకీయ అనుభవం, వలసవాదులు, కాంగ్రెస్‌ వాదులు, సీనియర్లు, జూనియర్లు అంటూ రోజుకో వివాదం సమస్యగా మారుతోంది. ఈ పంచాయితీపై ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌ గాందీనే స్వయంగా రంగంలోకి దిగారు. స్క్రీనింగ్‌ కమిటీ సభ్యులు సహా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి(Revanth Reddy) నుంచి రాహుల్‌ వివరాలు సేకరించారు. తెలంగాణలో పార్టీ గెలుపే లక్ష్యంగా అభ్యర్థుల ఎంపిక ఉండాలని రాహుల్ తేల్చి చెప్పారు. సుమారు అరగంటపాటు అభ్యర్థుల ఎంపిక, రాష్ట్రంలో రాజకీయ పరిస్థితు లు, కొత్త చేరికల అంశంపై చర్చించారు. ముఖ్యంగా ఇతర పార్టీల నుంచి వచ్చిన బలమైన అభ్యర్థులకు టికెట్లు ఇవ్వాల్సిన అవసరాన్ని రేవంత్‌ నొక్కిచెప్పినట్లు సమాచారం.

Congress Leader Rahul Gandhi made clear instructions for TS Candidate Selection for party leaders

రాహుల్ మార్గదర్శకం : సగానికిపైగా స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై స్క్రీనింగ్‌ కమిటీలో తలెత్తిన భిన్నాభిప్రాయాలను రాహుల్‌ దృష్టికి తీసుకెళ్లారు. అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌తో తెగదెంపులు చేసుకొని కాంగ్రెస్‌లోకి వస్తున్న నేతలకు టికెట్ల విషయంలో సమతౌల్యం లోపిస్తే పార్టీ గెలుపు అవకాశాలకు గండి పడుతుందన్న విషయాన్ని వివరించినట్లుగా సమాచారం. ఇక సామాజిక న్యా యం జరిగేలా బీసీలకు టికెట్ల కేటాయింపు అంశం సైతం ఈ భేటీలో చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ముదిరాజ్, గౌడ, యాదవ వర్గానికి అధిక టికెట్లు ఇచ్చేలా అభ్యర్థుల ఎంపిక ప్రక్రి కొనసాగిస్తున్నామని వివరించారని చెబుతున్నారు. బీఆర్‌ఎస్‌కన్నా కనీసం 6 నుంచి 8 టికెట్లు అధికంగా ఇచ్చే ప్రణాళికతో ముందుకు వెళుతున్నట్లు రేవంత్‌ వివరించినట్లు తెలుస్తోంది.

ఎంపికపై ఉత్కంఠ : పార్టీ ముఖ్య నేతలతో రాహుల్ అభ్యర్దుల ఎంపికపై టెలీ కాన్ఫిరెన్స్ నిర్వహించారు. గెలుపు ప్రాతిపదికనే అభ్యర్థుల ఎంపిక ఉండాలని రాహుల్‌ వారికి తేల్చి చెప్పారు. మైనంపల్లి చేరికతో టికెట్‌ కోల్పోతున్న నందికంటి శ్రీధర్‌కు రాహుల్‌ గాంధీ స్వయంగా భరోసా కల్పించినట్లు సమాచారం. భవిష్యత్తులో పార్టీ పదవుల్లో మంచి అవకాశాలు ఇస్తామని హామీ ఇచ్చినట్లు తెలిసింది. దాదాపు 35 సీట్లకు అభ్యర్దుల ఎంపికలో ఎలాంటి సమస్య లేదని తెలుస్తోంది. మిగిలిన నియోజకవర్గాల్లో రోజుకో అంశం ప్రస్తావన సమస్యగా మారుతోంది. దీంతో. అభ్యర్దుల ఎంపిక ప్రక్రియ పూర్తి అధికారికంగా జాబితా ప్రకటన ఎప్పుడనే అంశం కాంగ్రెస్ ఆశావాహుల్లో ఉత్కంఠ పెంచుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+