హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కొత్త ట్విస్ట్, ఎమ్మెల్యే పదవికి రేవంత్ రెడ్డి రాజీనామా: రాష్ట్రపతి పాలనకు డిమాండ్?

By Srinivas
|
Google Oneindia TeluguNews

Recommended Video

తెలంగాణ అసెంబ్లీ రద్దుపై లైవ్ అప్డేట్ | Live Update | Oneindia Telugu

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి గురువారం తన శాసన సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను స్పీకర్ ఫార్మాట్లో తీసుకు వచ్చారు. తన రాజీనామా లేఖను స్పీకర్ మధుసూదనా చారికి ఇచ్చేందుకు ప్రయత్నాలు చేశారు. ఆయన అందుబాటులో లేకపోవడంతో స్పీకర్ పీఏకు ఇచ్చారు.

అసెంబ్లీ రద్దుపై చకచకా: గవర్నర్‌తో సీఎస్, అధికారుల భేటీ, ఫాంహౌస్ రావాలని కేసీఆర్అసెంబ్లీ రద్దుపై చకచకా: గవర్నర్‌తో సీఎస్, అధికారుల భేటీ, ఫాంహౌస్ రావాలని కేసీఆర్

ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అసెంబ్లీని రద్దు చేస్తారని జోరుగా ప్రచారం సాగుతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అసెంబ్లీ రద్దు ప్రకటనకు ముందే రేవంత్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు.

స్పీకర్ పీఏకు రాజీనామా అందజేత

స్పీకర్ పీఏకు రాజీనామా అందజేత

ఊహించని విధంగా నాడు కాంగ్రెస్ పార్టీలో చేరిన రేవంత్.. ఇప్పుడు అనూహ్యంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని స్పీకర్ పీఏకు అందజేశారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడారు.

కేసీఆర్ పిచ్చి పరాకాష్టకు చేరింది

కేసీఆర్ పిచ్చి పరాకాష్టకు చేరింది

కేసీఆర్ వ్యవహారశైలికి నిరసనగా తాను రాజీనామా చేసినట్లు తెలిపారు. చిలక జోస్యాన్ని నమ్ముకొని కేసీఆర్ పరిపాలన సాగిస్తున్నారని, ఆయన పిచ్చి పరాకాష్టకు చేరుకుందన్నారు. ప్రజాస్వామ్య విలువలు అంటే కేసీఆర్‌కు ఏమాత్రం గౌరవం లేదని చెప్పారు. కేసీఆర్ ఉన్న శాసనసభలో తాను ఉండలేనని చెప్పారు. కేసీఆర్‌కు ప్రజలు గుణపాఠం చెబుతారన్నారు. తెరాస ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ప్రజల మధ్య ఉండాలన్న ఉద్దేశ్యంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినట్లు తెలిపారు.

రాష్ట్రపతి పాలనకు బీజేపీ డిమాండ్

రాష్ట్రపతి పాలనకు బీజేపీ డిమాండ్

తెలంగాణ బీజేపీ నేతలు గవర్నర్ అపాయింటుమెంట్ కోరారు. కేంద్ర నాయకత్వం సూచనలతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. అసెంబ్లీ రద్దు కాపీని పరిశీలించిన తర్వాత తెలంగాణ బీజేపీ భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించనుంది. మధ్యాహ్నం మీడియాతో మాట్లాడనున్నారు. తెలంగాణలో రాష్ట్రపతి పాలన విధించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేసే అవకాశముంది.

బస్సులో రాజ్ భవన్‌కు

బస్సులో రాజ్ భవన్‌కు

కేసీఆర్ 2014 జూన్ 2 ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పుడు సభను రద్దు చేయనున్నారు. కేబినెట్ భేటీ అనంతరం సభ రద్దుకు సంబంధించిన కేబినెట్ నిర్ణయాన్ని గవర్నర్‌కు ఇవ్వనున్నారు. కేసీఆర్, మంత్రులు బస్సులో రాజ్ భవన్ వెళ్లనున్నారు. కేబినెట్ భేటీకి ఇప్పటికే మంత్రులు, నేతలు ప్రగతి భవన్ చేరుకున్నారు. రేపు హుస్నాబాద్‌లో భారీ బహిరంగ సభ ఉంది. కేసీఆర్ రేపు కోయినాపల్లి వెంకటేశ్వర స్వామి వారిని దర్సించుకోనున్నారు. రేపు మధ్యాహ్నం రెండు గంటలకు హుస్నాబాద్ వెళ్తారు.

English summary
Telangana Congress Party leader and Kodangal MLA Revanth Reddy resigned AS MLA. He came to assembly to submit resignation letter.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X