రాజ్యసభకు యువనేత, హైకమాండ్ ఎంపిక: అక్కడే అసలు ట్విస్ట్ - నో ఇంట్రస్ట్..!!

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రాష్ట్రం నుంచి రెండు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. బీఆర్ఎస్ పోటీ చేయకపోతే.. కాంగ్రెస్ నుంచి రెండు స్థానాలు ఏకగ్రీవం కానున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ నుంచి సిట్టింగ్ ఎంపీ అభిషేక్ సింఘ్వీ కి తిరిగి రెన్యువల్ చేయాలని డిసైడ్ అయ్యారు. రెండో స్థానం నుంచి యువనేత పేరును హైకమాండ్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అయితే, అక్కడే అసలు ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇప్పుడు ఆయన కే ఖరారు చేస్తారా.. మరొకరికి సీటు దక్కుతుందా అనేది ఆసక్తి కరంగా మారుతోంది.

తెలంగాణ నుంచి రెండు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రస్తుతం అసెంబ్లీలో ఉన్న బలాల ఆధారంగా కాంగ్రెస్ కు రెండు స్థానాలు దక్కటం ఖాయంగా కనిపిస్తోంది. బీఆర్ఎస్ పోటీలో ఉంటే.. బీజేపీ, ఎంఐఎం నిర్ణయం కీలకంగా మారనుంది. కాగా, రెండు స్థానాలు తమ ఖాతాలోనే చేరుతాయని కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలో భాగంగా తెలంగాణ నుంచి ఇద్దరు అభ్యర్ధుల పైన కాంగ్రెస్ హైకమాండ్ దాదాపు స్పష్టత ఇచ్చింది. సిట్టింగ్ ఎంపీ.. హైకమాండ్ కు సన్నిహిత నేత అయిన అభిషేక్ సింఘ్వీకి తిరిగి రెన్యువల్ కానుంది. కాగా.. రెండో స్థానం ఖరారు పైన ఢిల్లీ కేంద్రంగా కీలక మంత్రాంగం సాగుతోంది. ప్రస్తుతం ఏఐసీసీ కార్యదర్శిగా సంస్థాగత వ్యవహారాలు చూస్తున్న వంశీచంద్‌రెడ్డి పేరును అధిష్ఠానం పెద్దలు కొందరు ప్రతిపాదిస్తున్నట్లు సమాచారం. రెండు రాజ్యసభ సీట్లలో ఒకటి అధిష్ఠానం కోటాలో అభిషేక్‌ మనుసింఘ్వికి ఇప్పటికే ఖరారైంది. రాష్ట్ర కోటాలో పలువురి పేర్లు రేసులోకి వచ్చాయి.

congress-leader-ship-likely-to-field-vamsi-chand-reddy-for-rajyasabha-from-telangana-here-the-detai

రాహుల్ పర్యటన వేళ తుది నిర్ణయం

దీంతో, రేసులో సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు హర్కార వేణుగోపాల్‌, ఎస్సీ మాదిగ సామాజికవర్గం నుంచి ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌, పార్టీ సీనియర్‌ నేత దొమ్మాట సాంబయ్య, బీసీల నుంచి పార్టీ సీనియర్‌ నేత వి.హనుమంతరావు తదితరుల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర కోటా సీటుకు అధిష్ఠానం వంశీచంద్‌రెడ్డి పేరును ప్రతిపాదిస్తుండటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే యువ నాయకుడిగా ఉన్న తనకు.. అప్పుడే ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొని రాజ్యసభ సభ్యత్వం తీసుకోవడం పట్ల ఆసక్తి లేదంటూ వంశీచంద్‌రెడ్డి.. తన సన్నిహితుల వద్ద అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమిపాలైన వంశీచంద్‌రెడ్డికి అవకాశం కల్పిస్తే.. భవిష్యత్తులో ఎమ్మెల్సీ పదవుల కోసం అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమిపాలైన వారి నుంచి డిమాండ్లు రావచ్చునన్న అభిప్రాయాలూ పార్టీలో వ్యక్తమవుతున్నాయి. దీంతో.. మార్చి 2న రాష్ట్రానికి రాహుల్ గాంధీ రానుండటంతో... ఆ రోజున రెండో అభ్యర్ధి పైన తుది నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+