'రాజకీయ పార్టీలకు మధ్యవర్తిగా గవర్నర్ నరసింహన్, టీడీపీ బీజేపీకి వ్యతిరేకంగా పని చేస్తోందనే'

హైదరాబాద్: రాజ్యాంగబద్ధంగా విధులు నిర్వర్తించవలసిన ఉమ్మడి తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ రాజకీయ పార్టీలకు మధ్యవర్తిగా మారారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీ హనుమంత రావు మంగళవారం విమర్శించారు.

తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ తెరాస ప్రభుత్వం రైతులకు సంకెళ్లు వేసినా, ధర్నా చౌక్ ఎత్తి వేసినా గవర్నర్ పట్టించుకోలేదన్నారు. ప్రతిపక్ష కాంగ్రెస్ ప్రజల పక్షాన ఇన్ని రోజులుగా చేస్తున్న పోరాటాలు గవర్నర్‌కు కనిపించ లేదా అని మండిపడ్డారు.

Congress leader VH lashes out at Governor

తెలుగు రాష్ట్రాల నివేదిక పేరిట గవర్నర్ ఢిల్లీకి వెళ్తున్నారని, ఇందులోనూ రాజకీయ మంత్రాంగమే ఉంటుందన్నారు. కర్ణాటకలో తెలుగుదేశం పార్టీ బీజేపీకి వ్యతిరేకంగా పని చేస్తోందన్నారు. ఆ ఎన్నికల్లో బీజేపీకి టీడీపీ మద్దతు కూడగట్టేందుకే ఏపీలో పర్యటించారన్నారు.

ఎవరు ఎన్ని కుట్రలు చేసినా కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సిద్ధరామయ్య మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+