కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పదవులు ఖరారు- రేవంత్ కోరుకున్న వారికే...!!

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ ఏకపక్షంగా విజయం సాధించటంతో అధినాయకత్వం ఇక కొత్త నిర్ణయాలతో సిద్దం అవుతోంది. అందులో భాగంగా ప్రభుత్వం.. పార్టీలో రేవంత్ కోరుకున్న విధంగా పదవుల ఖరారు.. మార్పుల దిశగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో.. ప్రస్తుతం కేబినెట్ లో ఉన్న ఖాళీల భర్తీతో పాటుగా రెండు మూడు మార్పులు ఖాయంగా కనిపిస్తోంది. పార్టీ.. ప్రభుత్వంలో కీలక పదవులను భర్తీ చేసేందుకు తుది కసరత్తు జరుగుతోంది.

ముఖ్యమంత్రి రేవంత్ పార్టీ నేతలతో కలిసి ఢిల్లీలో మకాం వేసారు. ఇక.. రాజకీయంగా మరింత బలోపేతం కావాలని రేవంత్ భావిస్తున్నారు. అందుకు హైకమాండ్ సైతం ఫ్రీ హ్యాండ్ ఇచ్చేలా నిర్ణయాలు తీసుకుంటోంది. అందులో భాగంగా కేబినెట్ విస్తరణ.. నామినేటెడ్ పదవుల్లో రేవంత్ లిస్టుకు ఆమోదం తెలిపేందుకు స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది. అయితే.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇచ్చిన సమయంలో సీనియర్లకు నామినేటెడ్ పదవులు అప్పగించారు. ఇక.. త్వరలో జెడ్పీ ఎన్నికలతో పాటుగా గ్రేటర్ కు ఎన్నికలు జరగాల్సి ఉంది.

congress-leaders-green-signal-for-cabinet-expansion-nominated-posts-announcement-as-cm-revanth-prop

దీంతో.. ఆ ఎన్నికలు పూర్తయ్యాక మంత్రివర్గ విస్తరణ చేపట్టాలనేది రేవంత్ ఆలోచనగా ఉంది. అయితే, కొందరు ఆశావాహులు ఢిల్లీలో తమ వంతు లాబీయింగ్ చేస్తున్నారు. రేవంత్ మాత్రం ఎన్నికల్లో మంత్రుల పని తీరు ఆధారంగానే ప్రక్షాళన ఉంటుందని సంకేతాలు ఇస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో.. పార్టీ హైకమాండ్ స్థానిక పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకునేలా రేవంత్ కు ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్లు సమాచారం.

రేవంత్ లెక్కలకే ఢిల్లీ ఆమోదం

రానున్న పరిషత్ ఎన్నికలు. ఇలాంటి కీలక సమయంలో మంత్రివర్గంలో మార్పులు చేర్పులు చేస్తే, పదవులు దక్కని వారి నుంచి అసమ్మతి వ్యక్తమై ఎన్నికలపై ప్రభావం చూపుతుందా అనే కోణంలోనూ హైకమాండ్ ఆరా తీసినట్లు సమాచారం. కేబినెట్ లో ఇద్దరు ముగ్గురు మంత్రులకు ఉద్వాసన తప్పదనే ప్రచారం సాగుతోంది. రంగారెడ్డి జిల్లా నుంచి మల్ రెడ్డి రంగారెడ్డి, తాండూర్ ఎమ్మెల్యే రాంమోహన్ రెడ్డి నల్గొండ జిల్లా నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రధానంగా మంత్రి పదవుల రేసులో ఉన్నారు. అయితే, రాజగోపాల్ రెడ్డికి పదవి దాదాపు లేదనేది స్పష్టం అవుతోంది. కాగా, ప్రస్తుతం ఉన్న వారిలో ఎవరిని తప్పిస్తారనే లెక్కలకు అనుగుణంగా కొత్త వారికి ఛాన్స్ దక్కనుంది. టీపీసీసీ చీఫ్ గా ప్రస్తుత కేబినెట్ మంత్రికి అవకాశం కల్పించి.. మహేష్ గౌడ్ ను తన మంత్రివర్గంలోకి తీసుకోవాలనేది రేవంత్ ఆలోచనగా చెబుతున్నారు. దీంతో.. ఢిల్లీ పర్యటన తరువాత రేవంత్ తీసుకునే నిర్ణయాల పైన ఆసక్తి నెలకొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+