Telangana: ఇది తెలంగాణ ప్రజల విజయం.. ఇదంతా రేవంత్ రెడ్డి కృషి వల్లే..!
కృష్ణాజలాల్లో తెలంగాణకు దక్కాల్సిన న్యాయపరమైన వాటా విషయంలో అంతర్రాష్ట్ర జలవివాద చట్టంలోని సెక్షన్ 3 పైనా తొలుత వాదనలు వింటామని జస్టిస్ బ్రిజేశ్ కుమార్ ట్రైబ్యునల్ అంగీకరించిన విషయం తెలిసిందే. ఈ విషయంలో రేవంత్ సర్కార్ కీలకంగా వ్యవహరించింది. సీఎం రేవంత్ రెడ్డితో పాటు భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆ శాఖ అధికారులు పలు మార్లు చర్చించినట్లు తెలిసింది.
ఎలాగైతే తెలంగాణకు దక్కాల్సిన వాటా దక్కుతోందని ఆలోచనలు చేశారు. కృష్ణా నదీ జలాల విషయంలో తెలంగాణ రాష్ట్రానికి ప్రయోజనం చేకూరేలా ట్రైబ్యునల్-II (కేడబ్ల్యూడీటీ-II) ఎదుట బలమైన వాదనలు వినిపించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తెలంగాణకు అంతర్రాష్ట్ర నదీ జలాల వివాద చట్టం (ఐఎస్ఆర్‌డబ్ల్యూడీఏ)-1956 సెక్షన్ 3 ప్రకారం నీటి కేటాయింపులు జరిపేలా వాదనలు ఉండాలని స్పష్టం చేశారు.

దీంతో అధికారులు భారీ కసరత్తు చేశారు. లెక్కలతో పాటు బ్రిజేశ్ కుమార్ ట్రైబ్యునల్ వెళ్లారు. దీంతో ట్రైబ్యునల్ వాదనలు వినడానికి ఓకే చెప్పింది. బ్రిజేశ్ కుమార్ ట్రైబ్యునల్ తీసుకున్న నిర్ణయం వెనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి ఉందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఇది తెలంగాణ విజయమని మంత్రి ఉత్తమ్ ప్రకటించారు. కానీ బీఆర్ఎస్ మాత్రం కేసీఆర్ వల్లే ఇది జరిగిందన చెబుతోంది.
ఇది ముమ్మాటికి కేసీఆర్ ప్రభుత్వ విజయమేననని హరీశ్ రావు చెబుతున్నారు. బీఆర్ఎస్ నేతలు ఎంత ప్రచారం చేసుకున్నా.. ఇది తెలంగాణ విజయమని.. సీఎం రేవంత్ ఘనత అని పేర్కొంటున్నారు. ఇన్ని ప్రభుత్వంలో ఉండి ఏం చేశారని హస్తం నేతలు ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తెలంగాణకు అన్యాయం జరకుండా ఉండేందుకు అన్ని రకాల చర్యలు చేపట్టిందని గుర్తు చేశారు. అందుకే జస్టిస్ బ్రిజేశ్ కుమార్ ట్రైబ్యునల్ అంతర్రాష్ట్ర జలవివాద చట్టంలోని సెక్షన్ 3 పైనా వాదనాలు వింటామని అంగీకరించిందని పేర్కొంటున్నారు.












Click it and Unblock the Notifications