మంత్రివర్గ విస్తరణ వేళ హైకమాండ్ అనూహ్య ట్విస్ట్..!!
తెలంగాణ మంత్రివర్గ విస్తరణ వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మంత్రివర్గ విస్త రణకు ముహూర్తం ఖరారైంది. ఏప్రిల్ 2వ తేదీ సాయంత్రం లేదా 3వ తేదీ ఉదయం మంత్రివర్గ విస్తరణ జరగనుంది. ఈ మేరకు గవర్నర్ కు ముఖ్యమంత్రి రేవంత్ సమాచారం ఇచ్చారు. ఢిల్లీలో మంత్రివర్గ కూర్పు పై పరిణామాలు వేగంగా మారుతున్నాయి. మంత్రులుగా అవకాశం రాని వారి విషయంలో పైన తుది కసరత్తు జరుగుతోంది. ఇదే సమయంలో హైకమాండ్ కొత్తగా మంత్రుల విషయంలో తాజా నిర్ణయం సంచలనంగా మారుతోంది.
వీరికి ఖాయమా
తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు ఢిల్లీ కేంద్రంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. విస్తరణలో భాగంగా నాలుగు మంత్రి పదవులు భర్తీ చేయాలని నిర్ణయించారు. మంత్రుల పేర్లు ఖరారు తరువాత అవకాశం రాని వారు తీసుకునే నిర్ణయాలు ఏ విధంగా ఉంటాయో అంచనా వేస్తోంది. అందులో భాగంగానే ఒకటి, రెండు స్థానాలు ఖాలీగా ఉండే లా ఆలోచన చేస్తోంది. నాలు గు స్థానాలు మాత్రమే భర్తీ చేయాలని భావిస్తోంది. మంత్రివర్గంలో ఖాళీగా ఉన్న ఆరు స్థానాలకు 30 మంది పోటీపడుతున్నారు. పార్టీ ముఖ్య నేతల నుంచి మంత్రి వర్గంలో అవకాశం కల్పించ టం పైన పార్టీ నాయకత్వం పేర్లు సేకరించింది.

తుది కసరత్తు
అందులో భాగంగా సీఎం ఇచ్చిన జాబితాలో సుదర్శన్‌రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, గడ్డం వివేక్ పేర్లు ఉన్నట్టు పార్టీలో ప్రచారం సాగుతోంది. వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్, దొంతి మాధవ రెడ్డి, ప్రేమ్‌సాగర్‌రావు పేర్లు పరిశీలన లో ఉన్నాయి. ఒక వేళ మంత్రివర్గ విస్తరణలో అయిదో స్థానం భర్తీ చేస్తే మైనార్టీ వర్గానికి దక్కనుంది. మైనార్టీ కోటాలో ఎమ్మెల్సీ అమీర్ అలీఖాన్ కు చోటు దక్కే అవకాశం ఉంది. అయితే, జాబితాలో ఇంకా మార్పులు చేర్పులు కొనసాగుతు న్నట్లు విశ్వసనీయ సమాచారం. పార్టీలో మంత్రి పదవి ఆశిస్తున్న వారు ఢిల్లీలోని పార్టీ ముఖ్య నేతలను కలుస్తున్నారు. అవకాశం కోసం తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. మంత్రి వర్గ విస్తరణతో పాటుగా పీసీసీ కార్యవర్గం, నామినేటెడ్ పోస్టుల విషయంలోనూ హైకమాండ్ తుది కసరత్తు చేస్తోంది.
వ్యూహాత్మక నిర్ణయాలు
కాగా.. తమకు మంత్రి పదవి ఇవ్వాల్సిన అవసరం వివరిస్తూ కొందరు నేతలు ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో, హైకమాండ్ ఆలోచనలో మార్పు కనిపిస్తోంది.వాకిటి శ్రీహరికి అవకాశం ఇవ్వాలని పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గే సూచించినట్లు సమాచారం. సీతక్క కు హోంమంత్రిగా పదోన్నతి కల్పిస్తారని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. సీనియర్ కాంగ్రెస్ నేత దొంతి మాధవరెడ్డి ఢిల్లీ వెళ్లారు. తనకు మంత్రి పదవి ఇవ్వాలని ఖర్గే, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌ను కలిశారు. చివరి నిమిషం వరకు ఆశావాహులు తమ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. కాగా, సామాజిక సమీకరణాల తో పాటుగా జిల్లాల వారీ ఎంపిక సమస్యగా మారుతోంది. దీంతో.. తుది జాబితా పైన పార్టీలో ఉత్కంఠ పెరుగుతోంది.












Click it and Unblock the Notifications