టీ కాంగ్రెస్ అభ్యర్దుల మార్పు - మూడో జాబితా సిద్దం, లిస్టులో..!!
తెలంగాణలో కాంగ్రెస్ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. పార్టీ ఇప్పటికే ప్రకటించిన అభ్యర్దుల్లో ముగ్గురికి బీ -ఫాంలు ఇవ్వకుండా పెండింగ్ లో పెట్టాలని రాష్ట్ర నేతలకు సూచించినట్లు సమాచారం. అయిదు నియోజకవర్గాల్లో అభ్యర్దుల మార్పు పైన చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. వనపర్తి, చేవెళ్ల, బోథ్ నియోజకవర్గాల అభ్యర్థులపై సమీక్షించాలని, వారికి బీ ఫారాలు ఇవ్వొద్దని అధిష్ఠానం ఆదేశించినట్టు సమాచారం. ఇదే సమయంలో తుది జాబితా సిద్దం ప్రకటించనుంది.
కాంగ్రెస్ తుది కసరత్తు: తెలంగాణలోని 119 స్థానాలకు కాంగ్రెస్ ఇప్పటి వరకు 100 స్థానాలకు అభ్యర్దులను ఖరారు చేసింది. ప్రకటించాల్సిన 19 స్థానాల పై కసరత్తు పూర్తయింది. వామపక్షాలతో పొత్తు..కొందరు ముఖ్య నేతలు పార్టీలో చేరిక వంటి అంశాలతో అన్ని సమీకరణాలను జాగ్రత్తగా పరిగణలోకి తీసుకొని తుది జాబితా ప్రకటనకు సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది.

వనపర్తిలో చిన్నారెడ్డి స్థానంలో మెఘారెడ్డికి, బోథ్‌లో వెన్నెల అశోక్ స్థానంలో నరేశ్‌జాదవ్‌కు టికెట్ ఇవ్వాలని భావిస్తున్నట్టు తెలిసింది.ఖమ్మం జిల్లాలో సత్తుపల్లి, అశ్వారావుపేట, ఇల్లెందు, వైరాలకు అభ్యర్దులను ప్రకటించటంతో పాటుగా.. సీపీఐకు కేటాయించినట్లుగా చెబుతున్న కొత్తగూడెంపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. సూర్యాపేటలో దామోదర్ రెడ్డి- రమేశ్ రెడ్డి మధ్య పోటీ ఉంది. తుంగతుర్ది సీటు కోసం పోటీ కొనసాగుతోంది.
బీ-ఫాంలు నిలిపివేత: కామారెడ్డి నుంచి రేవంత్ పోటీ దాదాపు ఖారరైంది. దీంతో, షబ్బీర్ అలీకి నిమాజాబాద్ అర్బన్ సీటును ఈ జాబితాలో ప్రకటించటం లాంఛనంగా కనిపిస్తోంది. అయితే, చివరి నిమిషంలో ఈ సీటు కోసం డీ సంజయ్ పేరు తెర మీదకు వచ్చింది. కామారెడ్డిలో రేవంత్ ఈ నెల 10న నామినేషన్ దాఖలు..అదే రోజున అక్కడే కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యా బీసీ డిక్లేరేష్ ప్రకటించేలా నిర్ణయించారు. బాన్సువాడలో ఏనుగు బాలరాజు - రవీందర్ రెడ్డిల మధ్య సీటు కోసం పోటీ నెలకొంది.
నారాయణ ఖేడ్ లో సంజీవరెడ్డి - సురేశ్ షెట్కర్ లో ఎవరికి సీటు కేటాయిస్తారనేది తేలాల్సి ఉంది. చెన్నూరు నుంచి మాజీ ఎంపీ వివేక్ పోటీ చేయటం ఖాయమైంది. పటాన్ చెరులో కాట శ్రీనివాస గౌడ్ తో పాటుగా నీలం మధు పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని డోర్నకల్ పైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
తుది జాబితాలో ఉన్నదెవరు: ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావటంతో ఈ రోజునే పూర్తి జాబితా విడుదల చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. రెండో జాబితాలో ప్రకటించిన అభ్యర్దుల్లో కొందరిని మార్చే అవాకాశం ఉందనే ప్రచారం పార్టీలో జోరుగా సాగుతోంది. ఇటు కాంగ్రెస్ లో చోటు చేసుకుంటున్న మార్పులతో బీఆర్ఎస్ అలర్ట్ అయింది. కొందరికి బీ -ఫాంలు ఇవ్వకుండా పెండింగ్ లో పెట్టింది.
ఆలంపూర్ అభ్యర్ది పైన చర్చ సాగుతోంది. గోషామహల్ అభ్యర్దిని ఖరారు చేయాల్సి ఉంది. అటు బీజేపీ పొత్తులో భాగంగా జనసేనకు ఇచ్చే సీట్లు ఖరారు చేసింది. శేరిలింగం పల్లి పైన రెండు పార్టీలు పట్టు పడుతున్నాయి. దీంతో, దాదాపుగా ఈ రాత్రికి తెలంగాణలో పోటీలో ఉన్న అభ్యర్దుల జాబితాలు ఫైనల్ అయ్యే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications