షర్మిల, అనిల్‌ది కబ్జాల చరిత్ర: జగ్గారెడ్డి సంచలనం, తోడికోడళ్లమంటూ రేవంత్‌తో!

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మధ్య సరదా సన్నివేశం చోటు చేసుకుంది. వీరిద్దరూ అసెంబ్లీ ఆవరణలో ఎదురుపడ్డారు. ఈ సందర్భంగా వీరిద్దరి మధ్యఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది.

తమది తోడికోడళ్ల పంచాయతీ అంటూ రేవంత్ రెడ్డితో జగ్గారెడ్డి

తమది తోడికోడళ్ల పంచాయతీ అంటూ రేవంత్ రెడ్డితో జగ్గారెడ్డి

రేవంత్ రెడ్డి దిగిపోయిన తర్వాత, అది పదేళ్ల తర్వాత అయిన కానీ, తానే టీపీసీసీ చీఫ్ అవుతానని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. అయితే, రేవంత్ రెడ్డి, తనకు మధ్య ఎలాంటి విభేదాలు లేవన్నారు. రేవంత్ రెడ్డి కూడా నవ్వుతూ అవునన్నట్లుగా సమాధానమిచ్చారు.

తమది తోడికోడళ్ల పంచాయతీ అని.. పొద్దున తిట్టుకుంటాం.. మళ్లీ కలిసి పోతామని జగ్గారెడ్డి ఆసక్తికరంగా స్పందించారు. రేవంత్ రెడ్డి పాదయాత్రకు మద్దతిస్తున్నట్లు జగ్గారెడ్డి తెలిపారు. ఇంకా పదేళ్లు అయ్యాకా.. రేవంత్ రెడ్డి దిగిపోయిన తర్వాత తానే పీసీసీ అధ్యక్షుడవుతానని అన్నారు. ఇప్పట్లో రేవంత్ రెడ్డిని పదవి నుంచి దింపడం సాధ్యం కాదని జగ్గారెడ్డి చెప్పారు.

షర్మిల ఆడరౌడీ అంటూ జగ్గారెడ్డి ఫైర్

షర్మిల ఆడరౌడీ అంటూ జగ్గారెడ్డి ఫైర్

ఇది ఇలావుండగా, ఓ మీడియాతో మాట్లాడుతూ.. వైటీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై సంచలన ఆరోపణలు చేశారు. షర్మిల వ్యాఖ్యలు సమర్థనీయం కాదన్నారు. ఆమె ఒక ఆడ రౌడీగా వ్యవహరిస్తున్నారన్నారు. తనను వాడువీడు అంటూ విమర్శలు చేశారని మండిపడ్డారు. టీఆర్ఎస్ వాళ్లు చేతకాక ఊరుకుంటున్నారు కానీ.. తానైతే షర్మిలను రోడ్డు మీద కూడా తిరగనీయనని అన్నారు.

షర్మిల, అనిల్‌ది కబ్జాల చరిత్ర అంటూ జగ్గారెడ్డి సంచలనం

షర్మిల, అనిల్‌ది కబ్జాల చరిత్ర అంటూ జగ్గారెడ్డి సంచలనం

వైఎస్ సీఎం కాకముందు షర్మిల, ఆమె భర్త అనిల్ ఆర్థిక పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. అనిల్ స్కూటర్‌కు పెట్రోల్ కూడా లేకుండా తిరిగేవాడని అన్నారు జగ్గారెడ్డి. షర్మిల, అనిల్ ది భూకబ్జాల చరిత్రేనని సంచలన ఆరోపణలు చేశారు. వైఎస్ కుటుంబంలో షర్మిల, అనిల్, జగన్, ఇతర కుటుంబసభ్యులకు ఇప్పటికే మాదాపూర్‌లో కబ్జాలున్నాయని జగ్గారెడ్డి ఆరోపించారు.

షర్మిలకు అవినీతి చేయకుంటే లక్షలకు లక్షలకు ఫండింగ్ ఎలా వస్తుందని జగ్గారెడ్డి ప్రశ్నించారు. అయితే, ఈ కబ్జాలు, అవినీతి వైఎస్ కు తెలిసి జరిగిందో తెలియక జరిగిందో తెలియదని అన్నారు. అందరూ అవినీతి పరులు.. షర్మిల ఒక్కరే నిజాయితీపరురాలా? అని ప్రశ్నించారు జగ్గారెడ్డి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+