BIG BREAKING: కాంగ్రెస్ ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి కాన్వాయ్ కి ప్రమాదం
నాగార్జున సాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి కాన్వాయ్ కి ప్రమాదం జరిగింది. ఆయన కాన్వాయ్ లో గన్ మెన్లు ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. రోడ్డు పక్కన ఉన్న ట్రాన్స్ ఫార్మర్ కు కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గుర్రంపోడు మండలం చేపూర్ గ్రామ సమీపంలో ఘటన జరిగింది. అయితే ఈ ప్రమాదంలో ఎమ్మెల్యేకు పెను ప్రమాదం తప్పింది. గుర్రంపోడు ఆలయ వార్షికోత్సవంలో పాల్గొనేందుకు ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి వెళ్తుండగా ప్రమాదం జరిగింది.

కారులో ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి కాంగ్రెస్ కురువృద్ధుడు, సీనియర్ నాయకుడు జానారెడ్డి కుమారుడు. ఆయన 2023లో జరిగిన ఎన్నికల్లో నాగార్జున సాగర్ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.












Click it and Unblock the Notifications