గుండెపోటుతో పడిపోయిన కార్యకర్తను సీపీఆర్ చేసి బ్రతికించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే
తెలంగాణలోని భద్రాచలంలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నేతలు అక్కడికి చేరుకున్నారు. ఆ సమయంలోనే ఓ కాంగ్రెస్ నేత ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలాడు. దీంతో అక్కడే ఉన్న ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు తక్షణమే స్పందించి సీపీఆర్ చేయడంతో ప్రాణాపాయం తప్పింది. అనంతరం ఆయనను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
సరైన సమయానికి స్పందించి కార్యకర్త ప్రాణాలు కాపాడిన ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావును అందరూ అభినందిస్తున్నారు. గుండెపోటుతో పడిపోయిన కార్యకర్తను దుమ్ముగూడెం మండల కేంద్రానికి చెందిన మోత్కూరు సుధాకార్ గా గుర్తించారు. డాక్టర్ వృత్తిలో నుంచి రాజకీయాల్లోకి వచ్చి.. ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్న వారిలో తెల్లం వెంకట్రావు కూడా ఒకరు. అలానే మంత్రి తుమ్మల సైతం కార్యకర్తకు పూర్తి స్థాయిలో వైద్యం అందించాలని అధికారులకు ఆదేశించారు. ఆయన ఆరోగ్యం గురించి అప్డేట్స్ ఇస్తూ ఉండాలని తెలిపారు.













Click it and Unblock the Notifications