Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మహాకూటమి సీట్ల సర్దుబాటు: కోదండరాం పార్టీకి కాంగ్రెస్ ఆఫర్, మెలిక

Recommended Video

    Telangana Elections 2018 : కోదండరాం పార్టీకి కాంగ్రెస్ ఆఫర్...! | Oneindia Telugu

    హైదరాబాద్: మహాకూటమిలో భాగంగా తమకు 12 సీట్లకు పైగా కావాలని తెలంగాణ జన సమితి అధినేత కోదండరాం కోరుతున్నారు. కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆరు నుంచి 8 సీట్లు ఇచ్చేందుకు సిద్ధపడింది. దీంతో చర్చలు కొలిక్కి రాలేదు. చివరకు మంగళవారం 11 సీట్ల వద్ద ఒప్పందం కుదిరిందని తెలుస్తోంది.

    పొత్తులో భాగంగా తెలంగాణ జన సమితికి 11 సీట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ అంగీకరించిందని చెబుతున్నారు. అయితే ఇందులో కాంగ్రెస్ ఓ మెలిక కూడా పెట్టిందట. పలు స్థానాల్లో ఇరు పార్టీల మధ్య స్నేహపూర్వక పోటీ ఉంటుందని తెలిపింది. అంటే టీజేఎస్ పోటీ చేసే స్థానాల్లో కాంగ్రెస్ తమ పార్టీ అభ్యర్థులను నిలబెట్టుకోవచ్చు.

    Congress offers 11 seats for Kodandarams Telangana Jana Samithi

    దీనిపై తెలంగాణ జన సమితి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిందని తెలుస్తోంది. మరోవైపు, తమకు కేటాయించిన స్థానాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కేటాయించే సీట్లపై ఆ పార్టీ అసహనం వ్యక్తం చేసినట్లుగా సమాచారం. ఖమ్మం, రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లో తమకు సీట్లను కేటాయించక పోవడంపై కూడా అసంతృప్తితో ఉంది.

    కాగా, తాము పది స్థానాల్లో పోటీకి సిద్ధంగా ఉన్నామని కోదండరాం సోమవారం ప్రకటించిన విషయం తెలిసిందే. అంతేకాదు తెజస తరఫున మేనిఫెస్టోను కూడా విడుదల చేశారు. రైతులకు రూ.2 లక్షల పంట రుణాల మాఫీ, అధికారంలోకి వస్తే తొలి సంవత్సరంలోనే లక్ష ఉద్యోగాలు, ఏటా ఉద్యోగ క్యాలెండర్‌, నెలకు రూ.3వేల వరకు నిరుద్యోగ భృతి, తెలంగాణ ఉద్యమకారులపై అన్ని కేసులనూ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ఎత్తివేయడం, సంవత్సరంలో హైదరాబాద్‌లో అమరుల స్మృతిచిహ్నం ఏర్పాటు, కౌలు రైతులతో సహా వాస్తవ సాగుదారులందరినీ గుర్తించి, వారందరినీ అన్ని ప్రభుత్వ వ్యవసాయ పథకాలకు లబ్ధిదారులుగా గుర్తించడం చేస్తామని మేనిఫెస్టోలో పొందుపర్చారు.

    ఆత్మహత్య చేసుకున్న రైతులు, కౌలు రైతుల కుటుంబాలకు నష్టపరిహారం ఉంటుందని పేర్కొన్నారు. ఇందిరా పార్క్ వద్ద ధర్నాచౌక్‌ పునరుద్ధరణ చేస్తామని తెలిపారు. తెలంగాణ ప్రదర్శనశాలగా ప్రగతి భవన్‌ను మారుస్తామన్నారు. ఈపీసీ వ్యవస్థను రద్దుచేసి, నిర్మాణ పనులను పెద్ద కాంట్రాక్టర్లకు ఇచ్చే పద్ధతికి స్వస్తి పలుకుతామన్నారు.
    స్థానికులకే అవకాశముంటుందన్నారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+