'' 2019లో గెలిచేవారికే టిక్కెట్లు, కెసిఆర్ అంటే నాకేం భయం''?
2019 ఎన్నికల్లో గెలిచే అభ్యర్థులకే టిక్కెట్టు కేటాయించనున్నట్టు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. గతంలో కంటే తాము దూకుడుగా పనిచేస్తున్నట్టు చెప్పారు. సీఎం అభ్యర్థిని ముందుగానే ప్రకటిస్తార
హైద్రాబాద్: 2019 ఎన్నికల్లో గెలిచే అభ్యర్థులకే టిక్కెట్టు కేటాయించనున్నట్టు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. గతంలో కంటే తాము దూకుడుగా పనిచేస్తున్నట్టు చెప్పారు. సీఎం అభ్యర్థిని ముందుగానే ప్రకటిస్తారనే విషయం తనకు తెలియదన్నారు.
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య విబేధాలు లేవన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో విపక్షంలో ఉన్న సమయంలో ఏ రకంగా పనిచేశామో, ఈ దఫా అంతకంటే ఎక్కువ దూకుడుగా పనిచేస్తున్నట్టు చెప్పారు.
2014 ఎన్నికల నాటి పరిస్థితుల నాటి పరిస్థితులకు ప్రస్తుత పరిస్థితుల్లో మధ్య తేడా ఉందన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. జాతీయ పార్టీల్లో ప్రాంతీయ పార్టీల్లో ఉన్నంత తేడా స్వేచ్చ ఉండదన్నారు.
రాష్ట్రంలోని ఏ నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిపై ఓ అంచనాకు వచ్చామన్నారు. పార్టీని బలోపేతం చేసేందుకు చర్యలను తీసుకొంటున్నట్టు చెప్పారు.పార్టీ నాయకత్వం తన పనితీరు పట్ల సంతృప్తిగా ఉందన్నారు. తెలుగు న్యూస్ ఛానల్ కు ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు విషయాలను వెల్లడించారు.

గెలిచేవారికే టిక్కెట్లు
2019 ఎన్నికల్లో గెలిచేవారికే టిక్కెట్లను కేటాయించనున్నట్టు పీసీపీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. ఇప్పటికే గెలిచే అభ్య ర్థులను అనధికారికంగా ఎంపికచేసినట్టుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో ఏ అసెంబ్లీ నియోజకవర్గంలో ఏ పార్టీ బలమెంతో ఒక అంచనాకు వచ్చినట్టు చెప్పారు. అయితే ఎన్నికలకు ఇంకా రెండేళ్ళ సమయం ఉందన్నారు. అయితే ఎన్నికల నాటికి ఆయా నియోజకవర్గాల్లో ఎవరిని బరిలోకి దింపితే విజయం సాధిస్తారో వారికే టిక్కెట్లను కేటాయించనున్నట్టు ఆయన ప్రకటించారు. అయితే ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించినట్టు చెప్పారు.

కెసిఆర్ అంటే భయం లేదు
తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ అంటే తనకు భయం లేదన్నారు. సరిహద్దులో పనిచేసిన తనకు కెసిఆర్ అంటే భయపడాల్సిన అవసరం లేదన్నారు. అయితే ఈ విషయంలో చర్చకు సిద్దమేనని తాను అసెంబ్లీలో ప్రకటించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. తాను మంత్రిగా ఉన్న సమయంలో కూడ ఎలాంటి తప్పు చేయలేదన్నారు.

ఉత్తర తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మారింది
ఉత్తర తెలంగాణలో 2014 ఎన్నికల సమయంలో సింగరేణి కార్మికులు వన్ సైడ్ గా టిఆర్ఎస్ కు ఓటు చేశారని చెప్పారు. అయితే నాటి ఎన్నికలకు ప్రస్తుత పరిస్థితులకు పరిస్థితి తేడా ఉందన్నారు. టిఆర్ఎస్ పట్ల సింగరేణి కార్మికుల్లో కూడ వ్యతిరేకత వచ్చిందన్నారు. ఉత్తర తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉందన్నారు. అంతేకాదు ఈ పరిస్థితిలో మార్పు రానుందనే ఆయన ఆశాభవాన్ని వ్యక్తం చేశారు.

ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటిస్తారో లేదో తెలియదు
ఎన్నికల సమయంలోనే ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటిస్తారో లేదో తనకు తెలియదన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. పార్టీని వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి తెచ్చేందుకు అందరినీ కలుపుకొని పోతున్నట్టు చెప్పారు. తనకు పార్టీలో ఎవరితో విబేధాలు లేవన్నారు. పార్టీ నాయకత్వం తన పనితీరు పట్ల సంతృప్తిగా ఉందన్నారు.కెసిఆర్ ప్రకటించిన సర్వే నివేదికలను రాజకీయాల్లో ఉన్నవారెవరూ కూడ విశ్వసించరని చెప్పారు. పార్టీలో ఉన్న అంతర్గత సమస్యలను కప్పిపుచ్చుకొనేందుకే కెసిఆర్ ఈ సర్వేలను తెరమీదికి తెస్తున్నారని ఉత్తమ్ ఆరోపించారు.
-
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
విశాఖపట్నం నుంచి అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !! -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్ -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్..












Click it and Unblock the Notifications