వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అలాంటి వ్యాఖ్యలా?: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ షోకాజు నోటీసులు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ నేత, ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ షోకాజు నోటీసులు జారీ చేసింది. పార్టీ హైకమాండ్, నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేశారని నోటీసులో పేర్కొంది. తన వ్యాఖ్యలపై రెండ్రోజుల్లోగా వివరణ ఇవ్వాలని స్పష్టం చేసింది.

కాంగ్రెస్ పార్టీ ఇటీవల ఏర్పాటు చేసిన కమిటీలపై రాజగోపాల్ రెడ్డితోపాటు వీ హనుమంతరావు, పొంగులేటి సుధాకర్ రెడ్డిలాంటి సీనియర్ నేతలు కూడా అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నేతల వ్యాఖ్యలపై క్రమశిక్షణ కమిటీ సీరియస్ అయ్యింది.

బ్రోకర్లు, జైలుకెళ్లిన వారికి ప్రాధాన్యతా? శనిలా కుంతియా: రేవంత్‌పై కోమటిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలుబ్రోకర్లు, జైలుకెళ్లిన వారికి ప్రాధాన్యతా? శనిలా కుంతియా: రేవంత్‌పై కోమటిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు

Congress party issues notice to komatireddy rajagopal reddy

క్రమశిక్షణ తప్పితే చర్యలు తప్పవని హెచ్చరించింది. నేతలపై విమర్శలు, హైకమాండ్ నిర్ణయాలను ధిక్కరించినందునే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి నోటీసులు జారీ చేసినట్లే పేర్కొంది.

కాగా, పార్టీలో నేతలు క్రమశిక్షణతో ఉండాలనే లేదంటే, చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యకర్తల శ్రమతోనే కాంగ్రెస్ పార్టీ నడుస్తోందని అన్నారు. ఎన్నికల సమయంలో నేతలు ఇష్టం వచ్చినట్లు వ్యవహరించడం సరికాదని హితవు పలికారు.

ఎన్నికల్లో గెలుపు కోసం సమష్టిగా పనిచేద్దామని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. పార్టీ అధినేత రాహుల్ గాంధీ చెప్పినట్లు నడుచుకుందామని నేతలకు చెప్పారు.

English summary
Congress party issued a notice to Party MLC Komatireddy Rajagopal Reddy for his comments on high command.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X