తూకం వేసినా కల్లాల్లోనే ధాన్యం.!కడ్తాల పేరుతో దోపిడి.!గురువారం పొలాల్లోనే కాంగ్రెస్ నిరసన దీక్ష.!

హైదరాబాద్ : ధాన్యాన్ని తూకం వేయడానికి నెల సమయం తీసుకుంటే తూకం వేసిన 15 రోజుల వరకు ధాన్యాన్ని తరలించక పోవడంతో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలంగాణ కిసాన్ కాంగ్రేస్ చైర్మన్ అన్వేష్ రెడ్డి స్పష్టం చేసారు. పంట చేతికొచ్చి రెండు నెలలు పూర్తికావస్తున్నా ఇప్పటివరకూ 54 లక్షల క్వింటాళ్లు కొనుగోలు చేసారని, ఇంకా 65 లక్షల వరకు కొనుగోలు చేయాల్సి ఉందని తెలిపారు. రాష్ట్ర కిసాన్ కాంగ్రేస్ కార్యవర్గ సమావేశం జూమ్ లో నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రధానంగా ధాన్యం కొనుగోలు మీద విస్తృతంగా చర్చ జరిగినట్టు అన్వేష్ రెడ్డి స్పష్టం చేస్తున్నారు. జిల్లా ల నుండి పాల్గొన్న అధ్యక్షులు, రాష్ట్ర కమిటీ సభ్యులు కొనుగోలు విషయంలో జరుగుతున్న లోపాలను సమావేశంలో మాట్లాడిన తర్వాత అన్ని జిల్లాల్లో తాలు దాన్యం పేరు మీద కొనుగోలు కేంద్రాల్లో కడ్తా తీస్తూ మిల్లుకు వెళ్లాక మళ్ళీ 5కిలోల వరకు కడ్తా తీస్తూ రైతుల ధాన్యాన్ని దోచుకుంటున్నారని అన్నారు.

Congress protests in the fields on Thursday 27th.!

సకాలంలో లారీలను సమకూర్చడంలో ప్రభుత్వం పూర్తిగా విఫమైందని అన్వేష్ రెడ్డి ఆరోపించారు. ఆలస్యం కారణంగా వర్షం పడి ధాన్యం తడిసిపోతే తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయటం లేదని అన్నారు. మరో పది రోజుల్లో కొనుగోలు పూర్తి చేయాలని సీఎం చంద్రశేఖర్ రావు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. రెండు నెలల్లో పూర్తిస్థాయిలో కొనుగోలు సాద్యం కానిది పది రోజుల్లో ఎలా సాధ్యం అవుతుందని అన్వేష్ రెడ్డి ప్రశ్నించారు. సీఎం చెప్పినట్టు జరగాలంటే ప్రభత్వ యంత్రాంగం యుద్ధప్రాతిపదికంగా లారీలను సమకూర్చి గన్ని బ్యాగుల సమస్యను పరిష్కరం చేసి తడిసిన ధాన్యంతో పాటు మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అన్వేష్ రెడ్డి డిమాండ్ చేసారు. మిల్లర్ల దోపిడీ ని అరికట్టి కొనుగోలు కేంద్రాల్లో వేసిన తూకం ఆధారంగానే రైతులకు ధర చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 27 న అన్ని జిల్లాల్లో ధాన్యం కల్లాలలో నల్ల బ్యాడ్జీలు ధరించి ఉదయం 7.30 నుండి 10గంటల వరకు నిరసన దీక్ష చేయాలని సమావేశంలో తీర్మానం చేయడం జరిగిందన్నారు.అందుకోసం అన్ని జిల్లాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని రాష్ట్ర కిసాన్ కాంగ్రేస్ పిలుపునిచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+