కాంగ్రెస్ జాబితా ఖరారు వేళ, అసలు వర్సస్ వలస - ఆ నివేదికలే కీలకం..!!
తెలంగాణ కాంగ్రెస్(T Congress) అభ్యర్దుల తొలి జాబితా విడుదలకు రంగం సిద్దం అవుతోంది. కసరత్తు దాదాపు తుది దశకు చేరంది. ఇప్పటికే 70 మంది అభ్యర్దుల విషయంలో ఏకాభిప్రాయం వచ్చినట్లు సమాచారం. మరో 30 స్థానాల విషయంలో మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ సమయంలో అభ్యర్దుల ఎంపికలో పార్టీ రాజకీయ వ్యూహకర్త సునీల్ కనుగోలు(Sunil Kanugolu) ఇచ్చిన సర్వే నివేదికలే కీలకంగా మారుతున్నట్లు తెలుస్తోంది.
అభ్యర్దుల ఎంపిక : కాంగ్రెస్(Congress) పార్టీలో అసెంబ్లీ అభ్యర్థుల ఎంపిక ఓ కొలిక్కి వస్తోంది. 70 నియోజకవర్గాలకు సంబంధించి వడపోతను పూర్తి చేసినట్టు తెలుస్తోంది. నలభైకి పైగా సీట్లకు ఒక్కో అభ్యర్థి పేరును, మరో 30 సీట్లకు ఇద్దరి పేర్ల చొప్పున ఫైనల్ చేసినట్టు సమాచారం. ఇద్దరేసి పేర్లను ఎంపిక చేసిన నియోజకవర్గాలకు సంబంధించిన సర్వేల ఆధారంగా అభ్యర్థిని ఖరారు చేసే అధికారాన్ని పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీకి అప్పగించినట్టు సమాచారం.

అభ్యర్థుల ఎంపికపై స్క్రీనింగ్ కమిటీ(Screening Committe) చైర్మన్ మురళీధరన్(Muralidharan) అధ్యక్షతన ఢిల్లీలో వరుసగా రెండోరోజూ నేతల భేటీ జరిగింది. ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు క్షేత్ర స్థాయి సమాచారం..పోటీలో ఉన్న వారిపైన సర్వేల్లో తేలిన అంశాలను కమిటీ ఉందు ఉంచినట్లు తెలుస్తోంది.
గెలుపే ప్రామాణికంగా : ఎంపిక సమయంలో పలు అంశాలను పరిగణలోకి తీసుకుంటున్నారు. రాజకీయ, కుల సమీకరణాలు, ప్రజాక్షేత్రంలో బలాబలాలు, సర్వే నివేదికల(Survey Reports) ఆధారంగా ఈ 30 స్థానాల్లో ఇద్దరేసి నేతలను ఎంపిక చేసినట్టు తెలిసింది. ఈ లిస్టులో ఎల్‌బీనగర్, చేవెళ్ల, రాజేంద్రనగర్, కుత్బుల్లాపూర్, ఉప్పల్, మేడ్చల్, శేరిలింగంపల్లి, బోథ్, ఖానాపూర్, కరీంనగర్, డోర్నకల్, మహబూబాబాద్, పరకాల
జనగాం, వర్ధన్నపేట, వనపర్తి, నారాయణపేట, నకిరేకల్, తుంగతుర్తి, నర్సాపూర్, దుబ్బాక, నారాయణఖేడ్, జుక్కల్, ఎల్లారెడ్డి, బాన్సువాడ, మునుగోడు, సికింద్రాబాద్, హుస్నాబాద్ తదితర నియోజకవర్గాలు ఉన్నట్టు సమాచారం. వీటికి ఎంపిక చేసిన ఇద్దరు అభ్యర్థుల్లో ఒకరిని ఫైనల్ చేసే అధికారాన్ని కేంద్ర ఎన్నికల కమిటీ (Central Eelction Committee)కి అప్పగించాలని భేటీలో నిర్ణయించారు.

అక్కడే చిక్కుముడి : 40 స్థానాలు మినహా.. మిగతా సీట్లకు అభ్యర్థుల ఎంపికపై నేతల మధ్య తీవ్రస్థాయిలో భేదాభిప్రాయాలు వ్యక్తమైనట్టు సమాచారం. కొన్ని స్థానాలపై చర్చ సమయంలో తీవ్ర స్థాయిలో వాదనలు చేసుకున్నట్టు తెలిసింది. అసలు కాంగ్రెస్ - వలస నేతలు (congress leaders)అన్న ప్రాతిపదికన ఈ వాగ్వాదం జరిగిందని.. ఎన్నారైలు, ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతల పేర్లను సీఈసీకి పంపే విషయంలో నేతలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసినట్టు సమాచారం.
మెజార్టీ సభ్యులు ఒక్క పేరే సూచించిన పలు నియోజకవర్గాల్లోనూ అభ్యర్థి ఎంపిక ఫైనల్ కాలేదని.. అలాంటి స్థానాలను ప్రస్తుతానికి పక్కనపెట్టాలని కొందరు నేతలు పట్టు బట్టినట్టు చెబుతున్నారు. దీంతో, మిగిలిన స్థానాల పైన కాంగ్రెస్ హైకమాండ్(congress hi command) జోక్యం అనివార్యమవుతుందనే ప్రచారం సాగుతోంది.












Click it and Unblock the Notifications