వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్ - టీఆర్ఎస్ మ‌ద్య పీక్స్ కి వెళ్తున్న ఆరోప‌ణ‌లు..! ర‌స‌వ‌త్తంగా మారిన టీ రాజ‌కీయం..!!

|
Google Oneindia TeluguNews

హైద‌రాబాద్ : కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీల మ‌ద్య మాట‌ల యుద్దం పీక్స్ కు చేరుకుంటోంది.ఒక పార్టీ పై మ‌రో పార్టీ నేత‌లు ఘాటైన ప‌ద‌జాలంతో రెచ్చి పోతున్నారు. పార్టీ పేరులోని ఆబ్రివేష‌న్ల‌ను మార్చేసి ప్ర‌జ‌ల‌పై ఒదిలేస్తున్నారు. వంద సీట్లు గెలుస్తామ‌ని ధీమా వ్య‌క్తం చేస్తున్న గుటాబీ పార్టీ ఆత్మ విశ్వాసాన్ని దెబ్బ‌తీసేంద‌కు కాంగ్రెస్ పార్టీ శ‌త విధాల ప్ర‌య‌త్నాలు చేస్తుంటే, అస‌లు అదికారాన్ని కాంగ్రెస్ పార్టీకి అందనిచ్చే స‌మ‌స్యేలేద‌ని గులాబీ పార్టీ భీష్మించుకుని కూర్చుంది. తెలంగాణ లో ఈ రెండు పార్టీల మ‌ద్య ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు, ఆరోప‌ణ‌ల‌కు ప్ర‌త్యారోప‌ణ‌లు, ఎత్తుల‌కు పైఎత్తులు, వ్యూహాల‌కు ప్ర‌తివ్యూహాలు చోటు చేసుకుంటున్నాయి.

 తెలంగాణలో పెరిగిపోతున్న ఎన్నికల హడావిడి..! మొద‌లైన మాట‌ల యుద్దం..!!

తెలంగాణలో పెరిగిపోతున్న ఎన్నికల హడావిడి..! మొద‌లైన మాట‌ల యుద్దం..!!

తెలంగాణలో ఎన్నికల హడావిడి పెరిగిపోతున్న కొద్దీ పార్టీలన్నీ స్పీడు పెంచేస్తున్నాయి. అధికార, ప్రతిపక్షాలు వ్యూహ ప్రతివ్యూహాలతో దూసుకుపోతున్నాయి. కొద్దిరోజుల్లో ఎన్నికల సమరానికి అంకురార్పణ జరగనున్న నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ వేడి రోజురోజుకూ పెరిగిపోతోంది. టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా ప్రతిపక్షాల్లోని మెజారిటీ పార్టీలు ఏకమవుతుండగా, భారతీయ జనతా పార్టీ, ఎంఐఎం తదితర పార్టీలు ఒంటరిగా బరిలోకి దిగబోతున్నాయి.

ఎన్నికలు అన్ని పార్టీల‌కు ప్ర‌తిష్టాత్మ‌క‌మే..! అందుకే తీవ్ర ఆరోప‌ణ‌లు..!

ఎన్నికలు అన్ని పార్టీల‌కు ప్ర‌తిష్టాత్మ‌క‌మే..! అందుకే తీవ్ర ఆరోప‌ణ‌లు..!

ఈ ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతోనే రాజకీయం ఆసక్తికరంగా సాగుతోంది. ప్రతిపక్షాలు బలం పుంజుకునే చాన్స్ ఉందనే కారణంతోనే కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేశారనే ప్రచారం జరుగుతోంది. దీనికి తోడు అసెంబ్లీకి పోటీ చేసే 105 మంది అభ్యర్ధులను ప్రకటించి ప్రతిపక్షాలపై ఒత్తిడి తీసుకురావచ్చని కేసీఆర్ ప్లాన్ చేశారనే పుకార్లు కూడా షికార్లు చేశాయి. ఇవే అంశాలను ప్రతిపక్ష పార్టీలు బలంగా వాడుకుంటున్నాయి. దీంతో కీలక నేతల మధ్య మాటల యుద్ధం మరింత ఆసక్తికరంగా సాగుతోంది.

 టీఆర్ఎస్ ని ఖంగుతినిపించాలంటున్న‌ కాంగ్రెస్.! కాంగ్రెస్ ను ఖ‌తం చేయాలంటున్న టీఆర్ఎస్..!

టీఆర్ఎస్ ని ఖంగుతినిపించాలంటున్న‌ కాంగ్రెస్.! కాంగ్రెస్ ను ఖ‌తం చేయాలంటున్న టీఆర్ఎస్..!

టీఆర్ఎస్ నేతలు ప్రతిపక్షాలను ఆత్మరక్షణలో పడేయాలనే ఉద్దేశంతో ఆయా పార్టీలపై, అందులోని ముఖ్య నేతలపై విమర్శనాస్త్రాలు సంధిస్తుండగా, ప్రత్యర్ధి పార్టీ నేతలు కూడా అదే స్థాయిలో ఎదురుదాడికి దిగుతున్నారు. ముఖ్యంగా టీడీపీ-కాంగ్రెస్ పొత్తుపై టీఆర్ఎస్ బాగా దృష్టి సారించింది. తెలుగుదేశం పార్టీ ఆంధ్రోళ్లదని, ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంటే తెలంగాణ ప్రజలు బుద్ధి చెబుతారని అంటున్నారు. ఈ రెండు పార్టీలు కలిస్తే టీఆర్ఎస్ ఓటమి ఖాయమనే భయంతోనే ఆ పార్టీ నేతలు ఇలా మాట్లాడుతున్నారని ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.

 టీఆర్‌ఎస్‌ అంటే తెలంగాణ రౌడీల పార్టీ ...! కాంగ్రెస్ కొత్త నిర్వ‌చ‌నం..! మండిప‌డుతున్న గులాబీ..!

టీఆర్‌ఎస్‌ అంటే తెలంగాణ రౌడీల పార్టీ ...! కాంగ్రెస్ కొత్త నిర్వ‌చ‌నం..! మండిప‌డుతున్న గులాబీ..!

తాజాగా కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నేత దాసోజు శ్రావణ్‌ టీఆర్ఎస్‌పై చేసిన వ్యాఖ్యలు తెలంగాణ‌లో వేడిని ర‌గిల్చాయి. ఆయన ఆ పార్టీకి కొత్త నిర్వచనం చెప్పారు. టీఆర్‌ఎస్‌ అంటే తెలంగాణ రౌడీల పార్టీ అని వ్యాఖ్యానించడంతో పాటు పొత్తుల విషయంపై కీలక విషయాలు మాట్లాడారు. 2009 ఎన్నికల్లో సీపీఎం, టీడీపీతో టీఆర్‌ఎస్‌ పొత్తు పెట్టుకుందని వారు పొత్తు పెట్టుకుంటే నైతికం, తాము పెట్టుకుంటే అనైతికమా అని ప్రశ్నిస్తూనే తమది ప్రజల కూటమి, టీఆర్‌ఎస్‌ది దొంగల కూటమి అని శ్రావణ్‌ మండిపడ్డారు. మాటల యుద్ధం ప్రజలకు మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌గా మారిందనే చ‌ర్చ జ‌రుగుతోంది.

English summary
As Telangana electoral rolls are increasing, all parties are speeding up. The ruling party and oppositions are coming with the strategy. The Congress TRS parties are approaching the war peeks. Another party leaders are gaining a strong vocabulary.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X