రేవంత్‌రెడ్డి ఎపిసోడ్: ఆ ముగ్గురిపైనే అందరి దృష్టి

Posted By:
Subscribe to Oneindia Telugu

వరంగల్: వరంగల్ జిల్లా నుండి రేవంత్‌రెడ్డి వెంట నడిచే టిడిపి నేతలు ఎవరనే విషయమై తీవ్రమైన చర్చ సాగుతోంది. ఇప్పటికే వేంనరేందర్‌రెడ్డి టిడిపిని వీడారు. జిల్లాకు చెందిన ముగ్గురు కీలక నేతలు టిడిపిలోనే ఉంటారా.. కాంగ్రెస్‌పార్టీలో చేరుతారా అనే విషయమై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ విషయమై రెండు మూడు రోజుల్లోనే స్పష్టత వచ్చే అవకాశం కన్పిస్తోంది.

  MLA Revanth Reddy resignation issue ఆ సస్పెన్స్ కూడా బద్దలు కొట్టిన రేవంత్ | Oneindia Telugu

  వారిద్దరూ స్నేహితులు: నరేందర్‌‌రెడ్డి కోసం కేసులోకి రేవంత్

  తెలంగాణ ఉద్యమం సమయం ఉధృతంగా సాగుతున్న సమయంలో వరంగల్ జిల్లాకు చెందిన టిడిపి నేతలు పార్టీని అంటిపెట్టుకొని ఉన్నారు. 2014 ఎన్నికల సమయంలో కడియం శ్రీహరి పార్టీని వీడారు.జిహెచ్ఎంసి ఎన్నికల తర్వాత ఎర్రబెల్లి దయాకర్‌రావు టిడిపిని వీడి టిఆర్ఎస్‌లో చేరారు.

  నాడు ఎమ్మెల్సీకి, నేడు ఎమ్మెల్యేకు రేవంత్‌ రాజీనామా: గెలిస్తేనే అసెంబ్లీకి

  టిడిపిలోనే కొనసాగుతున్న వేంనరేందర్‌రెడ్డి రేవంత్‌రెడ్డితో పాటు పార్టీని వీడారు. అయితే రేవంత్‌తో పాటే మరికొందరు నేతలు కూడ టిడిపిని వీడుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ తరుణంలోనే రేవంత్‌రెడ్డితో పాటు వెళ్ళే నాయకులు ఎవరెవరనే విషయమై తీవ్ర చర్చ సాగుతోంది.

  రేపు అమరావతికి రేవంత్‌రెడ్డి: చంద్రబాబు వద్ద మెలికలు?

  రేవంత్‌తో పాటు వెళ్ళే నేతలెవరు?

  రేవంత్‌తో పాటు వెళ్ళే నేతలెవరు?

  వరంగల్ జిల్లాకు చెందిన పలువురు టిడిపి నేతలు కూడ రేవంత్‌రెడ్డి వెంట కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే ప్రచారం సాగుతోంది.ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా ఉన్న రేవూరి ప్రకాశ్‌ రెడ్డి, సీతక్క, గండ్ర సత్యనారాయణరావు, ఈగ మల్లేశంలు ఏ నిర్ణయం తీసుకొంటారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. తాము మాత్రం పార్టీని వీడేది లేదని బహిరంగంగానే చెబుతున్నారు.

  క్షేత్రస్థాయి పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు

  క్షేత్రస్థాయి పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు


  రేవంత్‌రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీలో చేరితే రాజకీయంగా తమకు ఏ రకమైన ప్రయోజనం ఉంటుంది, లాభమా, నష్టమా అనే విషయాలపై పార్టీ నేతలు చర్చించుకొంటున్నారు. తమకు రాజకీయ భవిష్యత్‌కు ప్రయోజనం ఉంటుందని భావిస్తే రేవంత్‌ వెంట వెళ్ళేందుకు కొందరు నాయకులు నిర్ణయం తీసుకొనే అవకాశం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రేవూరి ప్రకాశ్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరితే రేవూరికి లాభం ఉండదనే అభిప్రాయాలను ఆయన సన్నిహితులు వ్యక్తం చేస్తున్నారు.స్థానికంగా ఉన్న పరిస్థితుల దృష్ట్యా రేవూరి ప్రకాష్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు ఉండకపోవచ్చని విశ్లేషకులు అంటున్నారు.

   సీతక్క ఏం చేస్తారు

  సీతక్క ఏం చేస్తారు

  ములుగు అసెంబ్లీ నియోజకవర్గం నుండి 2009 ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా విజయం సాధించిన సీతక్క ఏ నిర్ణయం తీసుకొంటారనేది ప్రస్తుతం ఉత్కంఠగా మారింది. ఎర్రబెల్లి దయాకర్‌రావు పార్టీని వీడిన సమయంలో కూడ సీతక్క టిడిపిని వీడుతారనే ప్రచారం సాగింది. కానీ, సీతక్క టిడిపిలోనే ఉన్నారు. రేవంత్‌ వెంట సీతక్క వెళ్ళే అవకాశాలు ఉంటాయా అనే ఉత్కంఠ నెలకొంది. కానీ, ఈ ప్రచారాన్ని టిడిపి నేతలు కొట్టిపారేస్తున్నారు. సీతక్క పార్టీని వీడే అవకాశం లేదని ములుగు టీడీపీ నాయకులు అంటున్నారు. ఏ క్షణాన ఎన్నికలు వచ్చినప్పటికీ సీతక్క ములుగు నుంచి ఘన విజయం సాధిస్తుందని ఆత్మవిశ్వాసంతో చెబుతున్నారు. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్య కాంగ్రెస్‌ నుంచి టికెట్‌ ఆశావహుడిగా వున్నారు. అందువల్ల సీతక్క కాంగ్రెస్‌లో చేరడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదంటున్నారు. ఇక

  టిఆర్ఎస్‌కు ధీటుగా గండ్ర సత్యనారాయణరావు

  టిఆర్ఎస్‌కు ధీటుగా గండ్ర సత్యనారాయణరావు

  భూపాలపల్లి నియోజకవర్గానికి చెందిన గండ్ర సత్యనారాయణరావు ప్రజా పునాది ఉన్న నేత. అయినప్పటి కీ అనేక కారణాలరీత్యా ఆయనను ఎమ్మెల్యే పదవి వరించడం లేదు. ముప్పయి ఏళ్లుగా తెలుగుదేశం పార్టీ లో వుంటూ సర్పంచ్‌గా, జడ్‌పీటీసీగా, ఎమ్మెల్యే స్థాయి నేతగా ఎదిగాడు. ఇటీవల జరిగిన రెండు ఎన్నికల్లో గండ్ర సత్యనారాయణరావు టిఆర్ఎస్‌ అభ్యర్థులను కాదని టిడిపి అభ్యర్థులను గెలిపించుకొన్నారు. గండ్రతో టిఆర్ఎస్‌ నేతలు సంప్రదింపులు జరుపుతున్నారనే ప్రచారం సాగుతోంది. పార్టీ మారితే ప్రయోజనం ఉండదు. కాంగ్రెస్ పార్టీ నుండి గండ్ర వెంకటరమణారెడ్డి గతంలో ఇక్కడి నుండి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఈ కారణాలతో గండ్ర సత్యనారాయణరావు కూడ పార్టీని వీడే అవకాశం లేదంటున్నారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Who is going to with Revanth Reddy from Warangal district.TRS, Congress leaders planning to talk with TDP key leaders in Warangal district . Vem Narendar Reddy already resigned to TDP.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి