Cong vs BRS: అధికారం డిసైడ్ అయ్యేది అక్కడే - గెలుపెవరిది..!!

తెలంగాణ ఎన్నికల రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. కాంగ్రెస్ తో వామపక్షాలు తిరిగి జట్టు కట్టే పరిస్థితి కనిపిస్తోంది. బీజేపీ - జనసేన సీట్ల షేరింగ్ చివరి దశకు వచ్చింది. ఒంటరిగా బరిలోకి దిగిన బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం చేసుకుంటూ ముందుకెళుతోంది. ఈ ఎన్నికల్లో హోరా హోరీ పోరు ఖాయమని అన్ని సర్వే సంస్థలు చెబుతున్నాయి. ప్రతీ సీటు బీఆర్ఎస్, కాంగ్రెస్ కు కీలకంగా మారుతున్నాయి. అయితే, ఆ జిల్లా ఇప్పుడు డిసైడింగ్ ఫ్యాక్టర్ గా మారుతోంది.

ఖమ్మం లో మారుతున్న లెక్కలు:తెలంగాణ రాజకీయం ఒక ఎత్తు..ఆ జిల్లాలో మాత్రం మరో ఎత్తు అన్నట్లుగా పరిస్థితి కనిపిస్తోంది. తెలంగాణ ఆవిర్భావం తరువాత జరిగిన ఖమ్మం జిల్లా రాజకీయాలు విభిన్నంగా ఉన్నాయి. 2014, 2018 ఎన్నికల్లో రాష్ట్రంలో బీఆర్ఎస్ హవా కొనసాగినా, ఈ జిల్లాలో మాత్రం పట్టు చిక్కలేదు. 2014 లో కొత్తగూడెంలో జలగం వెంకట్రావు ఒక్కరే గులాబీ పార్టీ నుంచి గెలిచారు. తరువాత జరిగిన ఉప ఎన్నికల్లో తుమ్మల గెలవటంతో పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య రెండుకు పెరిగింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లో చేరారు. అయినా 2018 ఎన్నికల్లో తిరిగి బీఆర్ఎస్ ఒక్క సీటుకే పరిమితం అయింది. మరోసారి టీడీపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అధికార పార్టీలో చేరారు.

Congress Vs BRS: Khammam district has become a centre of state politics Amid Assembly elections

ధీమాగా కాంగ్రెస్ నేతలు:ఖమ్మంలో పట్టు కోల్పోయినా ఇతర జిల్లాల్లో ఏకపక్షంగా గులాబీ పార్టీ సీట్లు సాధించటంతో రెండు సార్లు అధికారానికి ఇబ్బంది జరగలేదు. కానీ, ఇప్పుడు కాంగ్రెస్ పుంజుకుంది. మిగిలిన జిల్లాల్లో బీఆర్ఎస్ తో హారా హోరీ తలపడుతోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పది సెగ్మెంట్లలో ఈ సారి పోటా పోటీ రాజకీయం కొనసాగుతోంది. జిల్లాలో ఎలాగైనా బీఆర్ఎస్ ను దెబ్బ కొట్టాలని పార్టీ వీడి కాంగ్రెస్‌లో చేరిన నేతలు కసితో ఉన్నారు.

ఖమ్మం నుంచి తుమ్మల, పాలేరు నుంచి పొంగులేటి పోటీ చేస్తున్నారు.కోరం కనకయ్య, తాటి వెంకటేశ్వర్లు, పాయం వెంకటేశ్వర్లు కాంగ్రెస్ లో చేరారు. ఇక్కడ సామాజిక వర్గాల ప్రభావం కాంగ్రెస్‌కు కలిసొచ్చే అవకాశం కనిపిస్తోంది. టీడీపీ, వైఎస్సార్టీపీ ఈ సారి పోటీలో ఉండటం లేదు. ఈ రెండు పార్టీలకు చెందిన మద్దతు దారులు..సానుభూతి పరులు కాంగ్రెస్ వైపు చూస్తుండటం ఆ పార్టీకి కలిసొచ్చే అంశంగా కనిపిస్తోంది.

బీఆర్ఎస్ ఏం చేయబోతోంది:వామపక్షాలతో కాంగ్రెస్ పొత్తు బెడిసికొట్టినట్లుగా కనిపించినా..తాజాగా పొత్తు ఖాయం దిశగా అడుగులు పడుతున్నాయి. దీంతో జిల్లాలోని కొత్తగూడెం స్థానం సీపీఐకు దాదాపు ఖరారైంది. ఖమ్మం జిల్లా పైన కాంగ్రెస్ తొలి నుంచి గురి పెట్టింది. రాహుల్ గాంధీతో తొలి సభ ఇక్కడే నిర్వహించి ఎన్నికల సమర శంఖం పూరించారు. బీఆర్ఎస్ లో కీలకంగా పని చేసిన నేతలు ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్దులుగా నిలిచారు.

ఈ జిల్లాను గత ఎన్నికల్లో లాగా చూసే పరిస్థితి లేదు. హోరా హోరీ పోరులో ప్రతీ సీటు రెండు పార్టీలకు ప్రతిష్ఠాత్మకమే. అయితే, ప్రస్తుత పరిణామాలు జిల్లాలో మాత్రం పూర్తిగా కాంగ్రెస్ పై చేయి సాధిస్తుందనే అంచనాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ పది సీట్లు అధికారం డిసైడ్ చేయటంలో కీలకం కానున్నాయి. మరి..బీఆర్ఎస్ ఇక్కడ తిరిగి పుంజుకొనేందుకు ఎలాంటి వ్యూహాలు అమలు చేస్తుందీ..కాంగ్రెస్ ఎలా ముందుకెళ్తుందనేది జిల్లా రాజకీయాల్లో ఉత్కంఠ పెంచుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+