కేటీఆర్ పై కేసు - అసెంబ్లీలో రచ్చ రచ్చ..!!
తెలంగాణ అసెంబ్లీలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. కేటీఆర్ పైన ఏసీబీ కేసు పై చర్చ కోసం బీఆర్ఎస్ పట్టు బట్టింది. సమావేశాలు జరుగుతున్నప్పుడు కేటీఆర్‌పై కేసు పెట్టారని, అక్రమ కేసు పెట్టినప్పుడు ఆయనకు చెప్పుకునే అవకాశం ఇవ్వాలని హరీష్ డిమాండ్ చేసారు. దీనికి కాంగ్రెస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేసారు. ఈ క్రమంలో రెండు వైపులా వాగ్వాదం చోటు చేసుకుంది. స్పీకర్ పోడియం వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసనకు ప్రయత్నించగా.. కాంగ్రెస్ ఎమ్మెల్యే పేపర్లు విసరటం తో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి.
తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మధ్య రచ్చ చోటు చేసుకుంది. కేటీఆర్ పైన నమోదైన కేసు పై చర్చ కోసం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పట్టు బట్టారు. స్పీకర్ అందుకు నిరాక రించారు. స్పీకర్ పోడియం వైపు కోరుట్ల ఎమ్మెల్యే పేపర్లు విసిరేశారు. బోధ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సైతం పేపర్ బంచ్ ను విసరటంతో వివాదం చోటు చేసుకుంది. హరీష్ స్పీకర్ పోడియం పైకి ఎక్కే ప్రయత్నం చేసారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ హెడ్ ఫోన్ ను విసిరేసేందుకు ప్రయత్నం చేసారు. అదే సమయంలో కాగితాలను విసిరేసారు. దీంతో, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యేల వైపు దూసుకొచ్చారు.

రెండు వైపుల నుంచి రచ్చ మొదలు కావటంతో స్పీకర్ సభను వాయిదా వేసారు. ఈ ఉదయం సభ ప్రారంభమైన తరువాత ఈ ఫార్ములా కార్ రేసింగ్‌పై చర్చ కోసం బీఆర్ఎస్ నేతలు వాయిదా తీర్మానం ఇచ్చారు. సభలో తమకు కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చెప్పు చూపించారని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆరోపించారు. స్పీకర్ పోడియం వైపు బీఆర్ఎస్ సభ్యులు దూసుకెళ్లే సమయంలో వారిని మార్షల్స్ అడ్డుకున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దళిత స్పీకర్‌ను అవమానించేలా సభలో వ్యవహరించారని .. క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేసారు.












Click it and Unblock the Notifications