మీరు నేర్పిన విద్యే.. ప్రోటోకాల్ విషయంలో ఫ్లాష్ బ్యాక్ గుర్తు చేసుకోమంటున్న కాంగ్రెస్!!

తెలంగాణలో పదేళ్ళపాటు పాలన సాగించిన బీఆర్ఎస్ ఓటమి పాలు కావటం, కాంగ్రెస్ అధికారంలోకి రావటంతో రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన కొనసాగుతుంది. అయితే బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్ కూడా నీవు నేర్పిన విద్యనే నీరజాక్ష అంటుంది. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రోటోకాల్ పాటించకుండా ఎలా బిహేవ్ చేశారో గుర్తు పెట్టుకుని మరీ ఇప్పుడు బీఆర్ఎస్ కు ఫిట్టింగ్ పెడుతుంది.

ఇటీవల దేవాదాయ శాఖా మంత్రి కొండా సురేఖ జనగామ నియోజకవర్గంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆ సమీక్షలో బీఆర్ఎస్ ఎంఎల్ఏ పల్లా రాజేశ్వరరెడ్డితో పాటు, జనగామ బరిలో నిలిచి ఓటమిపాలైన కాంగ్రెస్ నాయకుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డిని కూడా వేదిక మీదకు ఆహ్వానించి కూర్చోబెట్టారు. దీంతో జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

Congress wants to recall the flash back of brs rule in protocol!!

ఓడిపోయిన అభ్యర్ధిని వేదికపైన తనతో సమానంగా ఎలా కూర్చోబెడతారు అని ప్రశ్నించారు. అయితే ఈ నేపధ్యంలో జనగామ ఎమ్మెల్యేకు మంత్రి కొండా సురేఖకు మధ్య వాగ్వాదం జరిగింది. ఆమె ఏ మాత్రం తగ్గకుండా సమావేశంలో ఉంటె ఉండండి.. లేకపోతే పొండి అంటూ తేల్చి చెప్పారు. దీంతో తీవ్ర అసహనం వ్యక్తం చేసిన జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి సమావేశం నుండి బయటకు వెళ్ళిపోయారు .

అయితే ఇక్కడ ప్రోటోకాల్ విషయంలో చేసిన పని గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఇతర పార్టీల ప్రజా ప్రతినిధుల విషయంలో చేసిన పనే. పదేళ్ళ కేసీయార్ పాలనలో ప్రోటోకాల్ ఏ మాత్రం పాటించలేదు. మంత్రుల సమీక్షల్లో కాంగ్రెస్, బీజేపీ ఎంఎల్ఏలను కాదని ఓడిపోయిన బీఆర్ఎస్ అభ్యర్ధులను కూర్చోబెట్టి చేసేవారు. ఓడిపోయిన అభ్యర్ధులనే నియోజకవర్గాల ఇన్చార్జిలుగా నియమించి వారికి అక్కడ పెత్తనం కట్టబెట్టేవారు.

అప్పట్లో అనేకమంది ఎమ్మెల్యేలు ప్రోటోకాల్ పాటించటం లేదని లబోదిబోమన్నారు. ములుగు నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క ప్రోటోకాల్ పాటించకపోవటం, అవమానించటం వంటి ఘటనలతో తీవ్ర అసహనం వ్యక్తం చేసిన సందర్భాలెన్నో.. ఇక ఈ క్రమంలోనే తమ పార్టీ నుండి ఓటమి పాలైన వారిని కూడా పాలనలో భాగం చేస్తున్నారు కాంగ్రెస్ మంత్రులు.

అయితే ఈ వ్యవహారంలో బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ కాస్త నయమనే చెప్పాలి. బీఆర్ఎస్ కనీసం స్థానిక ఎమ్మెల్యేలను కూడా ఏ కార్యక్రమానికి ఆహ్వానించేది కాదు. కానీ కాంగ్రెస్ మంత్రులు తమ సమావేశాలకు స్థానిక ఎమ్మెల్యేలను ఆహ్వానిస్తున్నారు. కానీ తమ పార్టీ నాయకులకు కూడా ప్రాధాన్యత ఇస్తున్నారు. ఏది ఏమైనా బీఆర్ఎస్ కు కాంగ్రెస్ కుక్క కాటుకు చెప్పుదెబ్బ అన్నట్టు సమాధానం చెప్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+