అనుమానాస్పద స్థితిలో కానిస్టేబుల్ భార్య మృతి
హైదరాబాద్: ఓ కానిస్టేబుల్ భార్య అనుమానాస్పదంగా ఆత్మహత్య చేసుకున్న సంఘటన హైదరాబాదులోని చాంద్రాయణగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. చాంద్రాయణగుట్ట గాంధీబొమ్మ సమీపంలో నివసించే జి.ప్రవీణ్ కంచన్‌బాగ్ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.
అంతకు ముందు ప్రవీణ్ సీఆర్‌పీఎఫ్ క్యాంపస్‌లో నివసించేవాడు. అప్పట్లో ఇంటి పక్కనే ఉన్న క్వార్టర్స్ ఉండే పూజ(21)ను ప్రేమించి 2014లో వివాహం చేసుకున్నాడు.

ఎప్పటి లాగే ఆ రోజు మాదిరిగానే ప్రవీణ్ ఉద్యోగానికి వెళ్లి మధ్యాహ్నం ఇంటికి తిరిగి వచ్చాడు. తలుపులు తట్టగా భార్య పూజ తీయలేదు. దీంతో ప్రవీణ్ పక్కింటి పైభాగం నుంచి ఇంట్లోకి చూడగా పూజ ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకుని కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
ఫలక్‌నుమా ఏసీపీ ఏంఏ బారి, చాంద్రాయణగుట్ట ఇన్‌స్పెక్టర్ రామారావు, తహసీల్దార్ జహురుద్దీన్ సంఘటన స్థలానికి వచ్చి ఆత్మహత్యకు గల కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేశారు. మృతురాలి తల్లిదండ్రులు సుకన్య, సంగయ్య చేరుకుని కూతురు మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరయ్యారు. కట్నం కోసం అల్లుడు వేధించేవాడని కూతురు తెలిపిందని వారు ఆరోపించారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు.












Click it and Unblock the Notifications