సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..!
కొన్ని పర్యటక ప్రాంతాలు మాటల్లో చెప్పలేనంత సౌందర్యంగా ఉంటాయి. అక్కడకు వెళ్తే మళ్లీ తిరిగి రావాలనిపించదు. అంత అద్భుతంగా అక్కడి ప్రకృతి మనల్ని కట్టిపడేస్తుంది. కర్ణాటకలోని కూర్గ్ ప్రాంతం కూడా ఆ కోవకు చెందినదే. ఇక్కడి కాఫీ తోటలు, దట్టమైన అడవులు, పొగమంచుతో కప్పబడిన కొండలు అబ్బో ఒక్కటేమిటి చాలా పర్యటక ప్రదేశాలకు కూర్గ్ నిలయం. ముఖ్యంగా ఈ హిల్ స్టేషన్ కు సమ్మర్ లో వెళ్లేందుకు టూరిస్టులు ఆసక్తి చూపిస్తుంటారు. అయితే కూర్గ్ అందాలను తనివితీరా చూసేందుకు రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ప్రత్యేకమైన ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. తక్కువ ధరకే ఈ హిల్ స్టేషన్ ను సందర్శించే అవకాశం ఉంది.
ఇక హైదరాబాద్ నుంచి కూర్గ్ కు తక్కువ ధరకే వెళ్లేందుకు రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ప్రత్యేకమైన ప్యాకేజీని తీసుకొచ్చింది. ఈ ప్రత్యేకమైన టూర్ మొత్తం 4 రాత్రులు, 5 రోజులుగా ఉంటుంది. ఈ ప్యాకేజీలో భాగంగా బేలూర్, కూర్గ్, హళేబీడు, మైసూర్ ప్రాంతాలను కూడా చుట్టేయొచ్చు. ఇక టూర్ విషయానికి వస్తే మొదటి రోజు హైదరాబాద్ నుంచి బెంగళూరుకు విమానం 6 గంటల 45 నిమిషాలకు స్టార్ట్ అవుతుంది. బెంగళూరు ఎయిర్ పోర్టుకు చేరుకున్నాక అక్కడినుంచి మైసూరుకు వెళ్తారు. మైసూర్ లోని ప్యాలెస్, బృందావన్ గార్డెన్స్ ను వీక్షిస్తారు.
రెండోరోజు శ్రీరంగపట్నం ఆలయాన్ని సందర్శిస్తారు. ఆ తర్వాత చెలువనారాయణ స్వామి ఆలయానికి చేరుకుంటారు. అక్కడే ఉన్న సోమనాథపుర, తలకాడు టెంపుల్స్ ను సందర్శించిన తర్వాత రాత్రికి తిరిగి మైసూర్ చేరుకుంటారు. అలా రాత్రికి మైసూర్ లోనే బస చేస్తారు. ఇక మూడోరోజు హోటల్ లో బ్రేక్ ఫాస్ట్ తర్వాత కూర్గ్ కు చేరుకుంటారు. అక్కడే ఉన్న టిబెటన్ మోనాస్టరీ, నిసర్గధామాను సందర్శిస్తారు. నాలుగోరోజు నకిలేష్ పూర్, బేలూరు ప్రాంతాలను సందర్శిస్తారు. అదే రోజు బెంగళూరుకు వచ్చి విమానంలో హైదరాబాద్ చేరుకుంటారు.

ఇక ఈ జర్నీ ధరకు సంబంధించిన వివరాలను చూస్తే రూ. 25 వేల నుంచే స్టార్ట్ అవుతుంది. ఇక ఈ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలు, ప్యాకేజీ బుకింగ్ కోసం రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ సైట్ ను విజిట్ చేయండి.












Click it and Unblock the Notifications