వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎస్సెమ్మెస్‌లో నెగిటివ్, ఫోన్ చేసి పాజిటివ్: గంటల్లోనే మారిన స్వరం..? ఆందోళనలో అధికారి, సిబ్బంది..

|
Google Oneindia TeluguNews

అతనో అధికారి.. ఇటీవల విధుల నిమిత్తం ఇతర అధికారులు సిబ్బందిని కలిశాడు. కానీ తర్వాత ఒంట్లో నలతగా ఉండటంతో పరీక్ష చేయించుకున్నాడు. కానీ వెంటనే కరోనా నెగిటివ్ అని ఎస్సెమ్మెస్ చేశారు. కానీ మరునాడు పాజిటివ్ అని ఫోన్ చేశారు. దీంతో విస్తుపోవడం అధికారి వంతయిపోయింది. వెంటనే సమీపంలో గల ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. కానీ పరీక్షలు చేసిన సిబ్బంది వైఖరిపై మాత్రం సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతోన్నాయి. కరోనా వైరస్ గురించి ఇంత అశ్రద్ధగా వ్యవహరిస్తారా అని మండిపడుతున్నారు. అధికారితో ఇలా వ్యవహరిస్తే... ఇక సామాన్య జనాల పరిస్థితి ఏంటీ అని ప్రశ్నిస్తున్నారు.

 తెలంగాణలో కరోనా కల్లోలం: 10వేలు దాటిన కేసులు, మరో ఐదు మరణాలు తెలంగాణలో కరోనా కల్లోలం: 10వేలు దాటిన కేసులు, మరో ఐదు మరణాలు

 నెగిటివ్.. కాదు పాజిటివ్

నెగిటివ్.. కాదు పాజిటివ్

మనం ఇప్పటివరకు చర్చించింది కుత్బుల్లాపూర్ సర్కిల్ గాజులరామారంకు చెందిన ఓ అధికారి గురించి. ఆయన ఇటీవల జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం, కూకట్ పల్లి జోనల్ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ విధుల్లో భాగంగా కొందరినీ కలిశారు. వారి ద్వారా అధికారికి కరోనా వైరస్ సోకి ఉంటుంది. అప్పటినుంచి ఆయన కాస్త నలతగా ఉంటున్నారు. కరోనా వైరస్ వ్యాపిస్తోన్న క్రమంలో ఎందుకైనా మంచిదని ఈ నెల 20వ తేదీన సూరారంలోని యూపీహెచ్‌సీ వెళ్లి పరీక్షలు చేయించుకున్నారు. అతని డ్రైవర్, పీఏ కూడా రక్త నమూనాలు ఇచ్చారు.

 ఆస్పత్రిలో చేరిక

ఆస్పత్రిలో చేరిక

బ్లడ్ శాంపిల్ ఇచ్చి వచ్చిన తర్వాత కరోనా నెగిటివ్ అనే సందేశం మొబైల్‌కి వచ్చింది. దీంతో అధికారి సహా పీఏ, డ్రైవర్ హమ్మయ్య అని కాస్త రిలాక్సయ్యారు. వారి ఆనందం కొన్ని గంటలకే పరిమితమైంది. మరునాడు అధికారికి నిమ్స్ ఆస్పత్రి నుంచి ఫోన్ వచ్చింది. మీకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఐసోలేషన్‌లో ఉండాలని చెప్పడంతో వారు నోరెళ్లబెట్టారు. తర్వాత సమీపంలో గల ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు.

Recommended Video

కొంపముంచిన ఎగ్జిబిషన్ మ్యాచ్‌.. టెన్నిస్ స్టార్ Novak Djokovic కు Corona!
 ఆందోళనలో సిబ్బంది

ఆందోళనలో సిబ్బంది

అధికారి, పీఏ, డ్రైవర్‌కు కరోనా పాజిటివ్ రావడంతో మిగతా అధికారులు, సిబ్బంది భయాందోళన చెందారు. వారితో తాము కూడా కలిశాం కదా అని సందేహాపడుతున్నారు. మరోవైపు బుధవారం కార్యాలయ భవనాన్ని సోడియం హైపో క్లోరైడ్‌తో శుద్ది చేశారు. తర్వాత అధికారి రూమ్‌కు లాక్ చేశారు. అయితే తొలుత నెగిటివ్ అని చెప్పి.. తర్వాత పాజిటివ్ రావడంతో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆరోగ్య కార్యకర్తలు అంతా బాధ్యతరహితంగా ఎలా ఉంటారని ప్రశ్నిస్తున్నారు.

English summary
officer and pa, driver test health center after that they receive messages corona negative. then call hospital staff told to officer you have corona positive.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X