కరోనా డిసెంబర్ నాటికి ఫ్లూలా మారే ఛాన్స్! తెలంగాణలో ఫోర్త్‌వేవ్ రాకపోవచ్చు, కానీ..: డీహెచ్ శ్రీనివాస్
హైదరాబాద్: తెలంగాణలో కరోనావైరస్ కేసులు అదుపులోనే ఉన్నాయని రాష్ట్ర ప్రజారోగ్య శాఖ సంచాలకులు(డీహెచ్) శ్రీనివాస్ తెలిపారు. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన మార్గదర్శకాలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. కోఠిలోని ఆయన కార్యాలయంలో డీహెచ్ శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు.

తెలంగాణలో కరోనా అదుపులోనే ఉంది: డీహెచ్ శ్రీనివాస్
కరోనా వైరస్ వ్యాప్తి పూర్తిగా పోలేదని, రానున్న మూడు నెలలపాటు మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు డీహెచ్. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల కారణంగా తెలంగాణలో కరోనా వ్యాప్తి అదుపులోనే ఉందన్నారు. అయితే, పక్క రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రజలు స్వీయ జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందని శ్రీనివాసరావు సూచించారు. తెలంగాణలో పాజిటివిటీ రేటు పెరగలేదని, హైదరాబాద్ మినహా 10కిపైగా కేసులు మరెక్కడా నమోదు కావడం లేదన్నారు. గత ఆరువారాలుగా రాష్ట్రంలో కోవిడ్ కేసులు అదుపులోనే ఉన్నాయన్నారు.

డిసెంబర్ నాటికి కరోనా ఫ్లూ లా మారే అవకాశం: డీహెచ్ శ్రీనివాసరావు
దేశంలోని పలు ప్రాంతాల్లో ఫోర్త్ వేవ్ ప్రారంభమైందన్నారు డీహెచ్ శ్రీనివాసరావు. థర్డ్ వేవ్ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నామన్నారు. సీఎం గత నాలుగు రోజులుగా కోవిడ్ వివరాలు తెలుసుకుంటున్నారని తెలిపారు. ఏప్రిల్, మే, జూన్ వరకు వివాహాలు, విహారయాత్రలు ఎక్కువగా ఉంటాయన్నారు. ఈ మూడు నెలలు ప్రభుత్వం చెప్పే జాగ్రత్తలు పాటించాలన్నారు. కోవిడ్ ఎక్స్ఈ వేరియంట్ ఎక్కువ ప్రభావం చూపకపోవచ్చన్నారు. 2022 డిసెంబర్ నాటికి కరోనా పూర్తిగా ఫ్లూ లా మారే అవకాశం ఉంది.

ఉచిత బూస్టర్ డోసుకు చర్యలు, మాస్కులు మస్ట్: డీహెచ్ శ్రీనివాస్
వస్తుందో రాదో తెలియని ఫోర్త్ వేవ్ నుంచి ప్రజలు బయటపడాలంటే ప్రతి ఒక్కరూ తప్పకుండా వ్యాక్సిన్ వేసుకోవాలన్నారు డీహెచ్ శ్రీనివాసరావు. రాష్ట్రంలో 18-59 ఏళ్ల వయసు వారికి ఉచితంగా బూస్టర్ డోసు పంపిణీకి చర్యలు తీసుకుంటామని శ్రీనివాసరావు తెలిపారు. 18-59 ఏళ్ల వయసు వారు ప్రైవేటు ఆస్పత్రుల్లో బూస్టర్ డోసు తీసుకోవాలని డీహెచ్ వెల్లడించారు. రాష్ట్రంలోని 12-17 ఏళ్ల వయసు వారు రెండో టీకా తీసుకోవాలని తెలిపారు. రెండో టీకా తీసుకొని 9 నెలల పూర్తయిన వారు మూడో డోసు తీసుకోవాలని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 60 ఏళ్లు పూర్తయిన వారు బూస్టర్ డోసు తీసుకోవాలని డీహెచ్ పేర్కొన్నారు. నిర్లక్ష్యం వహించకుండా ప్రజలందరూ మాస్కులు తప్పక ధరించాలని డీహెచ్ సూచించారు. వంద శాతం జనాభాకు రెండు డోసుల టీకా పంపిణీ పూర్తి చేశామని ఆయన వెల్లడించారు.

తెలంగాణలో ఫోర్త్‌వేవ్ రాకపోవచ్చు.. కరోనా పాజిటివిటీ రేటు పెరగలేదు
రాష్ట్రంలో ఎలాంటి నిబంధనలు అక్కర్లేదని డీహెచ్ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. రాబోయే 4 నుంచి 6 వారాల తర్వాత కరోనా కేసులు పెరిగే అవకాశముందని తెలిపారు. కొన్ని చోట్లా నాలుగో వేవ్ ప్రారంభమైందని డీహెచ్ శ్రీనివాసరావు తెలిపారు. కరోనా పూర్తిగా నిర్మూలన కాలేదని.. చైనా, తైవాన్, ఈజిప్టులో కేసులు పెరుగుతున్నాయని డీహెచ్ వెల్లడించారు. మనదేశంలోని ఢిల్లీ, హర్యానా, యూపీలో కరోనా కేసులు పెరుగుతున్నాయని తెలిపారు. ఢిల్లీలో పాజిటివిటి రేటు 4 శాతానికి చేరిందని.. తెలంగాణలో పాజిటివిటి రేటు పెరగలేదని స్పష్టం చేశారు. తెలంగాణలో నాలుగో వేవ్ రాకపోవచ్చని ధీమా వ్యక్తం చేశారు. ఎన్‌ఐఎన్ సీరో సర్వేలో సెరో పాజిటివిటీ 92.9 శాతంగా ఉందని వెల్లడించారు.

ఎండలు మండిపోతున్నాయి.. జాగ్రత్తలు తీసుకోండి
హైదరాబాద్‌లో సెరో పాజిటివిటీ 95 శాతంగా ఉన్నట్లు డీహెచ్ వివరించారు. ఆరోగ్య కార్యకర్తల్లో 92.8 శాతం మందిలో యాంటీబాడీలు ఉన్నాయని డీహెచ్ శ్రీనివాసరావు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎండలు బాగా ఎక్కువగా ఉన్నాయని డీహెచ్ శ్రీనివాసరావు వెల్లడించారు. మధ్యాహ్నాం 12 గంటల నుంచి 2 నుంచి సాయంత్రం 4 వరకు ఎవరూ బయటకు రావద్దని డీహెచ్ హెచ్చరించారు. ప్రజలు లేత రంగు దుస్తులు, కాటన్ వస్త్రాలు ధరించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ రోజుకు కనీసం 2.5 లీటర్ల నుంచి 4 లీటర్ల నీరు తాగాలని డీహెచ్ వివరించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, సెలైన్లు అందుబాటులో ఉంచామని డీహెచ్ శ్రీనివాసరావు వెల్లడించారు.
-
హైదరాబాద్ లో 'స్నో వరల్డ్'.. మంచులో ఫుల్ ఎంజాయ్.. తక్కువ ధరకే..! -
HRA: హైదరాబాద్ లో ఉండే వారికి భారీ గుడ్ న్యూస్, ఏప్రిల్ 1 నుంచే.. -
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
రంజాన్ స్పెషల్ స్వీట్ "డబుల్ కా మీటా" ఇలా ట్రై చేస్తారా..? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త!












Click it and Unblock the Notifications