Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అంజన్ కుమార్ యాదవ్‌కు కరోనా పాజిటివ్: అపోలోలో వెంటిలేటర్‌పై చికిత్స

హైదరాబాద్: కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కరోనావైరస్ బారినపడ్డారు. ప్రస్తుతం ఆయన అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇటీవల మూడు చింతలపల్లతిలో జరిగిన కాంగ్రెస్ పార్టీ దళిత, గిరిజన దండోరా దీక్షలో ఆయన పాల్గొన్నారు.

ఆ తర్వాత అంజన్ కుమార్ యాదవ్ జ్వరం, జలుబు లక్షణాలు కనిపించడంతో కరోనా పరీక్షలు చేసుకున్నారు. దీంతో ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలింది. మొదట ఇంటి వద్దే చికిత్స తీసుకున్నారు. అయితే, శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు తలెత్తడంతో సోమవారం అపోలో ఆస్పత్రిలో చేరారు.

coronavirus positive for congress leader anjan kumar yadav.

ప్రస్తుతం అంజన్ కుమార్ యాదవ్‌కు వైద్యులు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. త్వరలోనే తన తండ్రి ఆరోగ్యం మెరుగవుతుందని అంజన్ కుమార్ యాదవ్ కుమారుడు అనిల్ తెలిపారు. కాగా, ఇటీవల తెలంగాణలో రాజకీయ కార్యక్రమాలు ఎక్కువగా జరుగుతున్న విషయం తెలిసిందే. దీంతో కరోనా కేసులు పెరిగే అవకాశం కనిపిస్తోంది.

ఇది ఇలావుండగా, తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 338 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ఒకరు మరణించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 6,58,054 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, కరోనాతో ఇప్పటి వరకు 3,873 మంది మృతి చెందినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.

తాజాగా రాష్ట్రంలో కరోనా నుంచి 364 మంది కోలుకోగా, ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 6,48,317కు పెరిగింది. రాష్ట్ర ఆరోగ్యశాఖ హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. రాష్ట్రంలో మరణాల రేటు 0.58 శాతం ఉండగా, దేశంలో 1.3 శాతం ఉంది. రాష్ట్రంలో కోలుకున్నవారి రేటు 98.48 శాతం ఉండగా, దేశంలో 97.50 శాతం ఉంది. రాష్ట్రంలో మొత్తం యాక్టివ్‌ కేసుల సంఖ్య 5,864 ఉంది.

జిల్లాలవారీగా కొత్త కేసుల వివరాలు.. ఆదిలాబాద్‌-3, భద్రాది కొత్తగూడెం -10, జీహెచ్‌ఎంసీ -84, జగిత్యాల-16, జనగామ-6, జయశంకర్‌ భూపాలపల్లి- 3, జోగులాంబ గద్వాల -1, కామారెడ్డి- (ఎలాంటి కేసులు లేవు), కరీంనగర్‌-30, ఖమ్మం- 19, కొమురంభీం ఆసిఫాబాద్‌- 01, మహబూబ్‌నగర్‌-4, మహబూబాబాద్‌-6, మంచిర్యాల-7, మెదక్‌- 1, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి-17, ములుగు -3, నాగర్‌ కర్నూల్ - 1, నల్గొండ-21, నారాయణపేట- (ఎలాంటి కేసులు లేవు), నిర్మల్‌ -3, నిజామాబాద్‌-2, పెద్దపల్లి-16, రాజన్న సిరిసిల్ల-6, రంగారెడ్డి-21, సంగారెడ్డి-3, సిద్దిపేట-5, సూర్యాపేట-7, వికారాబాద్‌- (ఎలాంటి కేసులు లేవు), వనపర్తి-3, వరంగల్‌ రూరల్‌ -5, వరంగల్‌ అర్బన్‌-27, యాదాద్రి భువనగిరి-7 చొప్పున పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.

Recommended Video

    Pegasus Spyware : TMC VS BJP MPs Fight | Oneindia Telugu

    తెలంగాణ రాష్ట్రంలో కరోనా కొత్త కేసుల కంటే రికవరీలు ఎక్కువగా ఉండటం ఊరట కలిగించే అంశంగా మారింది. రోజురోజకు కోలుకునే వారి సంఖ్య పెరిగిపోతోంది. తెలంగాణ ప్రభుత్వం కరోనా కట్టడికి అనేక చర్యలు చేపట్టింది. లాక్‌డౌన్‌, వ్యాక్సినేషన్‌, తదితర ఆంక్షలు చేపట్టడం వల్ల ప్రస్తుతం కేసులు పూర్తిగా తగ్గుముఖం పట్టే దశకు చేరుకుంది. ఇది ఇలావుంటే, సెప్టెంబర్ 1 నుంచి పాఠశాలలను ప్రారంభించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పాఠశాలలను విద్యార్థుల కోసం సిద్ధం చేశారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+