Coronavirus : తెలంగాణలో వైద్యుల హైఅలర్ట్.. పల్మోనాజిస్టులు అందుబాటులో ఉండాలని ఆదేశాలు
కరోనా వైరస్ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వాసుపత్రుల్లో పనిచేస్తున్న పల్మోనాలిజిస్టులు అందరూ అందుబాటులోకి రావాలని సూపరింటెండెంట్‌లను ఆదేశించింది. అలాగే ఆరోగ్యశాఖ అధికారులందరూ అందుబాటులో ఉండాలని ఆదేశించింది. ఈ మేరకు ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆదివారం వైద్య శాఖ అధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
సోమవారం నుంచి హైదరాబాద్‌లోని గాంధీ మెడికల్ కాలేజీలో కరోనా వైరస్ వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. ప్రతీరోజూ 30 మందికి కరోనా వైద్య పరీక్షలు చేసే అవకాశం ఉంటుందని వైద్యులు ఈటలతో చెప్పినట్టు సమాచారం. ఒక్కో పరీక్షకు దాదాపు 10గంటల సమయం పడుతుందని తెలుస్తోంది.

కాగా,ఇప్పటివరకు తెలంగాణ ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదన్నారు ఈటల.చైనా నుంచి వచ్చే ప్రతీ ఒక్కరూ ఫీవర్ ఆసుపత్రి,గాంధీ ఆసుపత్రి,చెస్ట్ ఆసుపత్రుల్లో వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఆసుపత్రుల్లో చేరినవారికి చికిత్స అందించేందుకు అన్ని రకాల వసతులు కల్పించినట్టు చెప్పారు. ప్రతీ ఆసుపత్రిలో సరిపోయేంత సిబ్బందితో పాటు,మాస్కులు,సానిటైజర్లు అందుబాటులో ఉంచామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే సూచనలు పాటిస్తున్నామన్నారు. ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదన్నారు.












Click it and Unblock the Notifications