బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వేటు కు రంగం సిద్దం..!?
తెలంగాణ రాజకీయాలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కొండా సురేఖ ఎపిసోడ్ తరువాత ఇప్పుడు అసెంబ్లీ వేదికగా కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. సమావేశాల ప్రారంభ సమయంలోనే బీఆర్ఎస్ నేతల నిరసనలు వివాదంగా మారాయి. తమ పైన పోలీసులు అనుచిత ప్రవర్తన పైన ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే సమయంలో బీఆర్ఎస్ నేత ఎమ్మెల్సీ అనుచిత వ్యాఖ్యల వివాదం కొత్త మలుపు తీసుకుంది. వేటు వేయాలంటూ మంత్రులు ఫిర్యాదు చేసారు. ఆ దిశగా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.
అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాత మధు అనుచిత వ్యాఖ్యలు చేసారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. స్పీకర్‌పై మధు అనుచిత వ్యాఖ్యల వీడియోను సీఎంవో విడుదల చేసింది. తాతా మధుపై చర్యలకు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సిద్ధమవుతున్నట్లు సమాచారం. సభ నుంచి తాతా మధును బహిష్కరించే యోచనలో మండలి చైర్మన్ ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. మధు వ్యవహారంపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, ఈ వ్యాఖ్యలను స్పీకర్, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తీవ్రంగా ఖండించారు. పలువురు మంత్రులు తాతా మధు పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. అసెంబ్లీకి సుప్రీం స్పీకర్.. స్పీకర్‌ను ఎవరు తిట్టినా తప్పేనని చెప్పారు. స్పీకర్ సభకు అధిపతి అని.. ఆయనపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైనది కాదని పేర్కొన్నారు.

ఛైర్మన్ నిర్ణయం పై ఉత్కంఠ..!
బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో ఏమీ అనకపోయినా తనను, సంపత్‌ను సస్పెండ్ చేశారని తెలిపారు. స్పీకర్‌పై అనుచితంగా మాట్లాడితే క్షమించకూడదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హెచ్చరించారు. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను ధూషించిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాత మధు సభ్యత్వాన్ని వెంటనే రద్దు చేయాలని తెలంగాణ మంత్రి సీతక్క డిమాండ్ చేశారు. స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడం దారుణమని పేర్కొన్నారు. తాత మధును ఆ పార్టీ నుంచి బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ తక్షణం బహిష్కరించాలని మంత్రి సీతక్క డిమాండ్ చేశారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన తాత మధుపై చర్యలు తీసుకోవాలని ఎంపీ మల్లు రవి డిమాండ్ చేశారు. ఎస్సీ స్పీకర్‌పై మధు అనుచిత వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని పట్టుబట్టారు. అయితే, తాను అనుచిత వ్యాఖ్యలు చేయలేదని తాతా మధు చెబుతున్నారు. దీంతో.. ఇప్పుడు మండలి ఛైర్మన్ నిర్ణయం పైన పార్టీలో ఉత్కంఠ కొనసాగుతోంది.













Click it and Unblock the Notifications
