చంద్రబాబుపై కేసు పెట్టండి: కోర్టు ఆదేశం
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పైన కేసు నమోదు చేయాలని రంగారెడ్డి జిల్లా కోర్టు సైబరాబాద్ పోలీసులను సోమవారం ఆదేశించింది. తూర్పు గోదావరి జిల్లాలో మేడే ఉత్సవాల ప్రసంగాల్లో చంద్రబాబు.. తెలంగాణ సీఎం కేసీఆర్ పైన చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో కేసు పెట్టాలని కోర్టు ఆదేశించింది.
తెలుగుదేశం పార్టీ లేకుంటే కేసీఆర్ గొర్రెలు కాసేవారని చంద్రబాబు అన్నారు. దీనిపై యాదవ సంఘాలు భగ్గుమన్నాయి. సరూర్ నగర్‌కు చెందిన న్యాయవాది సుంకరి జనార్ధన్ గౌడ్ దీనిపై పదకొండో మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో ప్రయివేటు పిటిషన్ దాఖలు చేశారు.

కేసీఆర్ పైన చంద్రబాబు వ్యాఖ్యలు.. తెలంగాణ సీఎంను, గొర్రెల కాపర్ల వృత్తిని అవమానపరిచేలా ఉన్నాయని జనార్ధన్ గౌడ్ న్యాయస్థానంలో వేసిన పిటిషన్లో పేర్కొన్నారు. దీంతో చంద్రబాబుపై కేసు నమోదు చేసి తదుపరి చర్యలు తీసుకోవాలని చైతన్యపురి పోలీసులను కోర్టు ఆదేశించింది. కేసు దర్యాఫ్తు చేసి ఈ నెల 13న నివేదిక ఇవ్వాలని మెజిస్ట్రేట్ పోలీసులను ఆదేశించారు.












Click it and Unblock the Notifications